Begin typing your search above and press return to search.
కాకతీయ అవార్డులు వస్తున్నాయ్
By: Tupaki Desk | 22 March 2016 4:54 AM GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డులకు చాలానే చరిత్ర ఉంది. 1964లో మొదటిసారిగా నంది అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ అవార్డులు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ అవార్డులను ఇకపై కొత్త పేరుతో ప్రదానం చేసేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇక నుంచి వీటిని కాకతీయ అవార్డులుగా ఇవ్వనున్నారు.
తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ భేటి అయింది. తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి తలసాని చెప్పారు. షూటింగులకు సింగిల్ విండో అనుమతులు - ఫిలిం ఇనిస్టిట్యూట్ వంటి వాటిపై చర్చించారు. రాష్ట్రప్రభుత్వం అందించే అవార్డులపై కూడా ఏప్రిల్ లో నిర్ణయం ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇకపై సినీ రంగానికి కాకతీయ అవార్డుల పేరుతో ప్రభుత్వం అవార్డులు అందించనుందని సమాచారం. యాదాద్రి అనే పేరుకూడా ప్రతిపాదనల్లో ఉన్నా.. కాకతీయ అన్న పేరుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నంది అవార్డుల స్థానంలో ఇవి ప్రదానం చేయనున్నారు. వీటితో పాటు థియేటర్లలో 5వ షో కూడా ప్రదర్శించడం పై కూడా చర్చలు జరిగాయి.