Begin typing your search above and press return to search.
బిగ్ బాస్: ఈ వారం నందిని ఔట్.?
By: Tupaki Desk | 5 Aug 2018 8:04 AM GMTబిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అంచనాలకు మించి ఆదరణ చూరగొంటోంది. హోస్ట్ నాని శని, ఆదివారాల్లో అలరిస్తున్నాడు. ప్రతి శని వారం ఇంటిసభ్యులు చేసిన తప్పులకు చీవాట్లు పెడుతున్న నాని ఆదివారం వచ్చేసరికి సరదా సరదా గేమ్ లతో ఉత్సాహం పంచుతున్నాడు. ఇక ఆదివారం వచ్చేసిందంటే ఇంటిసభ్యుల్లో ఒకటే టెన్షన్. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
శనివారం ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ఐదుగురిలో ఇద్దరు సేవ్ అయినట్టు నాని ప్రకటించాడు. బాబు గోగినేని - కౌశల్ లు సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టు తెలిపాడు. ఈరోజు మిగిలిన దీప్తి, నందిని,గణేష్ లలో ఎవరో ఒకరు ఈరోజు ఇంటినుంచి బయటకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. యువ హీరోయిన్ నందినిరాయ్ ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోందని వార్తలు వెలువడుతున్నాయి. మొత్తం ఐదుగురి సభ్యుల్లో నందినికే తక్కువ ఓట్లురావడంతో ఆదివారం ఆమె హౌస్ విడిచి వెళ్లిపోనుందని తెలిసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రతివారం కౌశల్ తో గొడవ పెట్టుకున్న ఇంటిసభ్యులే ఎలిమినేట్ అవుతున్నారు.. ఈ వారం కూడా నందిని.. కౌశల్ ను తీవ్రంగా విమర్శించింది . తప్పుపట్టింది. ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. దీంతో ఆమె ఎలిమినేట్ అవుతుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
ఈ వారం నామినేట్ అయిన ఇంటిసభ్యులందరిలోకి కౌశల్ కు ఎక్కువ ఓట్లు వచ్చినట్టు తెలిసింది. కౌశల్ ఆర్మీతో పాటు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారట.. శనివారం నాని కూడా మీకు బయట పిచ్చ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని.. వారందరికీ స్ఫూర్తినిచ్చేలా ప్రవర్తించు అంటూ కౌశల్ కు క్లాస్ పీకాడు. అదే ఎఫెక్ట్ ఓటింగ్ లో అతడికి ఓట్ల వర్షం కురిపించిందట..
గడిచిన సోమవారం నామినేషన్ సందర్భంగా అంతకుముందు కూడా కౌశల్ కు, నందినికి మధ్య గొడవలు, వాగ్వాదాలు నడిచాయి. నందినిని సేవ్ చేసి తప్పు చేశానని కౌశల్ నామినేషన్ సందర్భంగా అన్నాడు. ఈ నేపథ్యంలోనే అశేష అభిమానం ఉన్న కౌశల్ దెబ్బకు నందిని ఇంటినుంచి వెళ్లిపోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇక నందిని రాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక పలు సినిమాల్లో అవకాశం దక్కించుకున్నట్టు ఆ మద్య బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన యాంకర్ ప్రదీప్ తెలిపాడు. ‘అల్లరి నరేష్-సునీల్’ జంటగా తీస్తున్న సినిమాలో కూడా నందిని ఎంపికైందట..ఇలా బిగ్ బాస్ తో క్రేజ్ సంపాదించుకున్న నందిని టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవడం విశేషం.