Begin typing your search above and press return to search.

అనుకున్న‌దే మ‌ళ్లీ జ‌రిగింది.. నందిని ఔట్‌!

By:  Tupaki Desk   |   6 Aug 2018 4:01 AM GMT
అనుకున్న‌దే మ‌ళ్లీ జ‌రిగింది.. నందిని ఔట్‌!
X
లీకుల మీద లీకులు అన్న‌ట్లుగా సాగుతోంది బిగ్ బాస్ సీజ‌న్ 2. గ‌తానికి భిన్నంగా బిగ్ బాస్ హౌస్ లో ఏం జ‌రగ‌నుంది? ఎలాంటి నిర్ణ‌యాలు వెలువ‌డ‌నున్నాయి? లాంటి ఆస‌క్తిక‌ర అంశాలు సోష‌ల్ మీడియాలో ముందే వ‌చ్చేస్తున్నాయి. గ‌డిచిన కొద్ది వారాలుగా చోటు చేసుకున్న కీల‌క అంశాల‌న్నీ సోష‌ల్ మీడియాలో ముందే ఊహించిన‌వే జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం.

అయితే.. ఇవ‌న్నీ ఊహ‌లు.. అంచ‌నాలు కావ‌ని.. లీకులుగా తేల్చేస్తున్నారు ప‌లువురు ఈ వారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే నందిని హౌస్ నుంచి ఔట‌య్యారు. ఇంటి స‌భ్యుల్లో భిన్న‌మైన యాటిట్యూడ్ ఉన్న కౌశ‌ల్ కు సోష‌ల్ మీడియాలో భారీ మ‌ద్ద‌తు ల‌భిస్తున్న వైనం తాజాగా మ‌రోసారి రుజువైంది.

ముందు నుంచి వెలువ‌డుతున్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే.. ఆదివారం ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో నందిని ఎలిమినేష‌న్ మీద ప్ర‌చారం జోరందుకుంది. ఖాయంగా ఈ వారం నందిని ఔట్ కావ‌టం ప‌క్కా అంటూ స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మ‌ధ్య‌న నందిని డ‌బుల్ గేమ్ ప్లే చేస్తుంద‌ని.. కావాల‌నే కౌశ‌ల్ ను టార్గెట్ చేస్తుంద‌న్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో ఎక్కువై.. ఆమెపై నెగెటివిటీ పెరిగేలా చేసింది.

త‌నీష్ తో నందిని క్లోజ్ కావ‌టం.. వారిద్ద‌రూ క‌లిసి చేసే ఎక్స్ ట్రాలు కూడా నందినిపై నెగిటివిటీ పెరిగేలా చేసిందంటున్నారు. కౌశ‌ల్ తో పెట్టుకున్నోళ్లు హౌస్ లో ఉండ‌ర‌న్న ప్ర‌చారానికి త‌గ్గ‌ట్లే.. తాజా నందిని ఎలిమినేష‌న్ ఉండ‌టంతో.. కౌశ‌ల్ సెంటిమెంట్ మ‌రోసారి వ‌ర్క్ వుట్ అయ్యింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏమైనా.. నందిని ఎలిమినేష‌న్ తో కౌశ‌ల్ హ‌వా మ‌రింత పెరిగింద‌నే చెప్పాలి.