Begin typing your search above and press return to search.

ప్రాజెక్ట్‌ కే లో 'జురాసిక్‌ పార్క్' రేంజ్‌ సీన్స్‌

By:  Tupaki Desk   |   15 May 2023 8:00 PM GMT
ప్రాజెక్ట్‌ కే లో జురాసిక్‌ పార్క్ రేంజ్‌ సీన్స్‌
X
ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్‌ వరల్డ్ మూవీ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ కూడా ఒక అద్భుతం అన్నట్లుగా ఉండబోతుంది అంటూ ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్న వారు చెబుతున్నారు.

ప్రాజెక్ట్‌ కే సినిమా ఒక విభిన్నమైన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ తో రూపొందుతున్నది. ఈ సినిమాను అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. అశ్వినీదత్ కూతురు బ్యానర్ నుండి అన్నీ మంచి శకునములే అనే సినిమా ఈ వారంలో రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు దర్శకురాలిగా నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.

నందిని రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ కే సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్ట్‌ కే సినిమా గురించి ఆమె మొదట నాకు పెద్దగా తెలియదు కానీ.. గేమ్ ఛేంజర్ సినిమా అవుతుందని నమ్ముతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

జురాసిక్ పార్క్‌ సినిమాలో డైనోసర్స్‌ ఎంట్రీ సమయంలో ఎలా అయితే గూస్ బంప్స్ వస్తాయో అలాంటి సన్నివేశాలు ప్రాజెక్ట్‌ కే సినిమాలో చూడవచ్చు అన్నట్లుగా నందిని రెడ్డి ఇచ్చిన హింట్ తో ప్రాజెక్ట్ కే గురించి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అనడంలో సందేహం లేదు.

నందిని రెడ్డి ప్రాజెక్ట్‌ కే గురించి తెలియదు అంటూనే జురాసిక్ పార్క్‌ రేంజ్ సన్నివేశాలు అంటూ ప్రభాస్ అభిమానులను కలల ప్రపంచంలో విహరించేలా చేసింది అనడంలో సందేహం లేదు.