Begin typing your search above and press return to search.
నందిని రెడ్డి గంటల తరబడి ట్రైనింగ్ ఇచ్చిందట!
By: Tupaki Desk | 6 July 2019 6:47 AM GMTసమంతా తాజా చిత్రం 'ఓ బేబీ' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ మౌత్ టాక్.. మంచి రివ్యూస్ తో విజయం దిశగా సాగుతోంది. ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా సమంతా నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. ఛాలెంజింగ్ పాత్ర అయినా సామ్ తనదైన స్టైల్ లో మెప్పించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా వయసు మళ్ళిన మహిళ హావభావాలను పలికించడంతో మరోసారి సామ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక నెటిజన్ సమంతాను మెచ్చుకున్న ట్వీట్ ను దర్శకురాలు నందినీ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా నవ్వుల ఎమోజిలతో షేర్ చేశారు."#ఓ బేబీ హెచ్చరిక: సమంతా అనే ఒక నటి ఉంది. ఆమె నటిస్తుంది. పాత్రలో లీనమౌతుంది. మిమ్మల్ని అందులోకి తీసుకుపోతుంది. కానీ మీరు సినిమా థియేటర్ ను వదిలి వెళ్ళే సమయంలో ఆమె మిమ్మల్ని వదలదు. ఇదేదో డేంజరస్ గా ఉందే ఓ మై బేబీ. నందినీ రెడ్డి గారు సూపర్. కంగ్రాట్స్."
అలా అని క్రెడిట్ అంతా సమంతాకే ఇచ్చేస్తే ఎలా? ఈ సినిమాలో సమంతా 'ఆత్మ'.. అదేనండీ సమంతాకు అద్భుతంగా డబ్బింగ్ చెప్పిన చిన్మయి శ్రీపాదకు కూడా మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఈమధ్య సమంతా తన సినిమాలకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది. కానీ ఈ సినిమాకు మరోసారి చిన్మయి చేత డబ్బింగ్ చెప్పించారు. వయసు మళ్లిన స్త్రీ మాట్లాడినట్టుగా ఒక యాసతో మాట్లాడి చిన్మయి అందరినీ క్లీన్ బౌల్డ్ చేసింది. ఇది గతంలో సమంతాకు డబ్బింగ్ చెప్పిన సినిమాలకు పూర్తిగా భిన్నమైంది. దీంతో చిన్మయి డబ్బింగ్ టాలెంట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ రెస్పాన్స్ కు థ్రిల్ అయిన చిన్మయి తన ట్విట్టర్ ఖాతా ద్వారా డైరెక్టర్ నందిని రెడ్డికి ఈ అవకాశం తనకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. తనతో గంటల తరబడి కూర్చొని.. యాస సరిగ్గా వచ్చేవరకూ తనకు ట్రైనింగ్ ఇచ్చిందని.. పలు కారణాల వల్ల 'ఓ బేబీ' తను స్పెషల్ అని.. థ్యాంక్ యూ నందిని అమ్మ అంటూ ట్వీట్ చేసింది. దీనికి అందిని రెడ్డి "గంటల తరబడి చెప్పినా.. ఒక్కసారి కూడా విసుక్కోకుండా నేర్చుకున్నందుకు థ్యాంక్స్. నువ్వు బెస్ట్ చిను" అంటూ రిప్లై ఇచ్చింది. ఈలెక్కన సమంతా ఆత్మను నందిని అమ్మ ఫుల్లుగా కష్టపెట్టినట్టే!