Begin typing your search above and press return to search.
అన్నీ మంచి శకునములే.. కెరీర్ లోనే బెస్ట్ క్లైమాక్స్
By: Tupaki Desk | 17 May 2023 4:22 PM GMTఅలా మొదలైంది అంటూ కెరీర్ ను మొదలు పెట్టిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఆ తర్వాత వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చుతూ వచ్చాయి. సమంతతో ఓ బేబీ సినిమా కాస్త పర్వాలేదు అన్నట్లుగా నిలిచినా కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదు అనేది బాక్సాఫీస్ వర్గాల మాట.
ఓ బేబీ చిత్రం తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'అన్నీ మంచి శకునములే' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. విభిన్నమైన ప్రేమ కథతో ఈ సినిమాను రూపొందించినట్లుగా తెలుస్తోంది.
మహానటి సినిమా ఫేం స్వప్న సినిమాస్ నిర్మాణంలో అన్నీ మంచి శకునమేలే నిర్మాణం జరిగింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకురాలు నందిని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఆమె చాలా పాజిటివ్ వ్యాక్యలు చేసింది.
ఇన్నాళ్ల తన సినీ కెరీర్ లో ఈ సినిమాకు రాసిన క్లైమాక్స్ చాలా స్పెషల్ అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా చివరి 20 నిమిషాల సన్నివేశాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయని నందిని రెడ్డి పేర్కొంది. కెరీర్ లోనే అత్యుత్తమ క్లైమాక్స్ అంటూ ఆమె చెప్పడంతో సినిమాపై ఆసక్తి క్రియేట్ అవుతోంది.
ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు లేవని హీరో అలిగాడు అంటూ వచ్చిన పుకార్లపై నందిని రెడ్డి స్పందిస్తూ సంతోష్ ఈ సినిమా విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాడు. యాక్షన్ సన్నివేశాలు పెట్టమని అతడు అడగలేదు. కథలో యాక్షన్ సన్నివేశాలు కుదరవని ముందే మాట్లాడుకున్నాం.
దాన్ని బట్టే సినిమాను పూర్తి చేశాం. తప్పకుండా ఈ సినిమా అందరికి కూడా నచ్చుతుందని నందిని రెడ్డి నమ్మకం వ్యక్తం చేసింది. మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.