Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ పెళ్లైన త‌ర్వాత నందిని రెడ్డి పెళ్లి!

By:  Tupaki Desk   |   17 May 2023 6:56 PM
ప్ర‌భాస్ పెళ్లైన త‌ర్వాత నందిని రెడ్డి పెళ్లి!
X
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఎవ‌రంటే? ట‌క్కున గుర్తొచ్చేది డార్లింగ్ ప్ర‌భాస్. బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకుండా ఎంత ఫేమ‌స్ అయ్యాడో? సౌత్ ప‌రిశ్ర‌మ మొత్తానికి డార్లింగ్ అంత‌గా ఫేమ‌స్ అయ్యాడు. అత‌ని పెళ్లిపై ఎప్ప‌టిక‌ప్పుడు ఇంట్రెస్టింగ్ క‌థ‌నాలు వెలువ‌డుతుంటాయి. పెద‌నాన్న కృష్ణం రాజు ఉండ‌గానే అత‌ని పెళ్లి చేయాల‌న్న‌ది ప్లాన్ . కానీ పెద్దాయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం డార్లింగ్ పెళ్లిని మ‌రింత వెన‌క్కి వెళ్లింది. భీమ‌వ‌రం అమ్మాయి సెట్ అయిందంట. టాలీవుడ్ లో ఆ హీరోయిన్ ని పెళ్లాడ‌బోతున్నాడా? అంటూ సోష‌ల్ మీడియాలో నిత్యం క‌థ‌నాలు వెలువ‌డుతూనే ఉంటాయి.

వాటిని ఎంజాయ్ చ‌య‌డం ప‌రిపాటే. అయితే తాజాగా మ‌హిళా ద‌ర్శ‌కులు రాలు నందిని రెడ్డి పెళ్లి అంశం ఓ ఇంట‌ర్వ్యూలో చ‌ర్చ‌కొచ్చింది. నేరుగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటార‌ని అమెని అడిగితే ముందుగా స‌ల్మాన్ ఖాన్ పేరు చెప్పారు. ఆయ‌న పెళ్లి చేసుకున్న త‌ర్వాత నేను కూడా చేసుకుంటా అన్నారు. ఇంత‌లో స‌ల్మాన్ ఖాన్ వ‌ర‌కూ ఎందుకు మ‌న ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌భాస్ ఉన్నాడుగా! అంటే అవును అత‌ని పేరు ఎలా మ‌ర్చిపోయాను. ప్ర‌భాస్ పెళ్లి చేసుకోగానే నేను చేసుకుంటాను అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారామే.

`అలా మొద‌లైంది` సినిమాతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మైన అమె ఆ త‌ర్వాత `జ‌బ‌ర్ద‌స్త్`..`క‌ళ్యాణ వైభోగ‌మే`..` ఓ బేబి` లాంటి చిత్రాలు తెర‌కెక్కించారు. ద‌ర్శ‌కురాలిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ఈ చిత్రాలు తీసుకొచ్చాయి. త్వ‌ర‌లో రిలీజ్ కానున్న‌ `అన్నీ మంచి శ‌క‌నుములే` సినిమాకి ఆమె ద‌ర్శ‌కురాలు. రిలీజ్ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె పై విధంగా స్పందించారు.

అలాగే నందిని రెడ్డి ద‌ర్శ‌కురాలు కాక‌పోముందు కొన్ని టీవీషోస్ కి ప‌నిచేసారు. ద‌ర్శ‌కురాలిగా స్టార్ హీరోల‌తో సినిమాలు చేయాల‌న్న‌ది ఆమె డ్రీమ్. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో లేడీ ద‌ర్శ‌కుల్ని వేళ్ల మీద లెక్క‌పెట్టొచ్చు. బి.జ‌య స్వ‌ర్గస్తులైన త‌ర్వాత నందిని రెడ్డి ఒక్క‌రే క‌నిపిస్తున్నారు. ఇంకా ప్ర‌తిభావంతులు ఉన్నా అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్నారు.