Begin typing your search above and press return to search.
నందిని రెడ్డి, ఇంతలోనే ఎంత ట్విస్టు!
By: Tupaki Desk | 12 Oct 2019 1:30 AM GMTఉన్నవి లేనివి కలిపి రాసేస్తే జర్నలిస్టులపై కొందరు విరుచుకుపడుతుంటారు. కానీ అందుకు భిన్నంగా తనపై వచ్చిన వార్తలపై మహిళా దర్శకురాలు నందిని రెడ్డి స్పందించిన వైనం ఆసక్తికరంగా ఉంది. గత కొద్ది రోజులుగా 'ఓ బేబి' డైరెక్టర్ నందిని రెడ్డి 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహిస్తున్నారని.. నెట్ ఫ్లిక్స్ టేకాఫ్ చేస్తోందని ప్రచారమవుతోంది. కొందరైతే అడ్వాన్స్ డ్ గా వెళ్లి అమలాపాల్- జగపతిబాబు వంటి స్టార్లతో తన పార్ట్ షూటింగ్ కి నందిని రెడీ అవుతున్నారని ప్రచారం చేశారు.
అయితే అది నిజమా? అంటే నిజం కాదనే తాజాగా నందిని రెడ్డి స్పందన రివీల్ చేస్తోంది. ''వై అమ్మా.. ఏంటో ఈ వెరైటీ రూమర్స్'' నెట్ ఫ్లిక్స్ 'లస్ట్ స్టోరీస్' అంటూ సబ్ టైటిల్స్ వేస్తున్నారు ఏమిటో! అంటూ కాస్తంత గుంభనగానే సోషల్ మీడియాలో స్పందించారు నందిని రెడ్డి. దీంతో అసలు నందిని రెడ్డి ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించడం లేదని అర్థం చేసుకోవాల్సి వస్తోంది.
అయితే కనీసం అమలాపాల్ తో సినిమా అయినా ఉంటుందా? అంటే దానికి కూడా నందిని రెడ్డి నుంచి సరైన ఆన్సర్ లేదు. ప్రస్తుతం కథా చర్చలేవైనా జరుగుతున్నాయా? అమలాపాల్ ఓ బేబి దర్శకురాలికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందా? అసలింతకీ ఏమా కథ అన్నది తేలాల్సి ఉంది. వై అమ్మా.. ఆ ప్రచారం వెనక నిజమేమిటో చెప్పొచ్చుగా