Begin typing your search above and press return to search.
అయిదేళ్ళ తర్వాత.. అదే ప్రేమ కావాలట..!
By: Tupaki Desk | 23 Jan 2016 5:30 AM GMT"మనకి జ్వరమొచ్చినపుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినపుడు నాన్నుంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నపుడు పక్కన ఫ్రెండ్ ఉంటె బావుంటుంది." ఇవన్నీ తీన్ మార్ సినిమాకోసం త్రివిక్రమ్ కలం నుండి కదిలొచ్చిన మాటలే. ఈ మాటల్లో అమ్మ - నాన్న - స్నేహితుడు ప్రేమకు ప్రతిరూపాలే. ఇలాంటి ప్రేమకోసం అయిదేళ్ళెం ఖర్మ జీవిత కాలం ప్రయత్నించొచ్చు. కానీ అయిదేళ్ళ క్రితం చూపించిన ప్రేమ మళ్ళీ ఇప్పుడు కావాలంటున్నారు ఓ సినిమా డైరెక్టర్.
నందినీ రెడ్డి దర్శకురాలిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నిన్నటికి అయిదేళ్ళు పూర్తయింది. 2011 జనవరి 21న 'అలా మొదలైంది' సినిమాతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. ఈ విషయాన్నే గుర్తు చేసుకుంటూ "అయిదేళ్ళ క్రితం మీ అందరితో నా జర్నీ అలా మొదలైంది.. అప్పుడు చూపించిన ప్రేమకు, అభినందనలకు థాంక్స్. కళ్యాణ వైభోగమే సినిమాతో నాపై అదే ప్రేమను కురిపిస్తారని ఆశిస్తున్నాను" అంటూ రాసుకొచ్చారు ఈ లేడీ డైరెక్టర్. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కళ్యాణ వైభోగమే సినిమా వచ్చేనెల 5న విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెపై ప్రేమను కురిపించేది లేనిది తెలిసేది ఆరోజునే. ప్రేక్షకుల ప్రేమ నందిని రెడ్డిక్కి దక్కాలని కోరుతూ ఆల్ ది బెస్ట్..!