Begin typing your search above and press return to search.
అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: నందిని రాయ్
By: Tupaki Desk | 4 Dec 2022 11:22 AM GMTతెలుగు నటి నందిని రాయ్ టాలీవుడ్ కి సుపరిచియతమే. `040` చిత్రంతో తెరంగేట్రం చేసిన బ్యూటీ అటుపై `మాయ`..`ఖుషీ ఖుషీగా`..`మోసగాళ్లకు మోసగాడు`..`సిల్లీ ఫెలోస్` ..`శివరంజని` లాంటి చిత్రాల్లో నటించింది. కానీ అవేవి పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు. కమర్శియల్ గా రాణించకపోవడంతో నందిని హీరోయిన్ల రేసులో వెనుకబడే ఉంది.
ఇంకా తమిళ్...కన్నడ.. మలయాళ.. హిందీ సినిమాల్లో సైతం నటించింది. అక్కడా అదే పరిస్థితి. సీరియస్ గా ప్రయత్నాలైతే చేస్తుంది గానీ సక్సెస్ అవ్వడం లేదు. అలాగని ఖాళీగానూ ఉండటం లేదు. వచ్చిన చిన్నపాటి అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇటీవలే `భాగ్ సాలే`..`గాలివాన` లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
వాటిపై పెట్టుకున్న ఆశలు సైతం ఒమ్ము అయినట్లే కనిపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్ మొదట్లో సినిమాలు ఆడకపోవడంతో సూసైడ్ చేసుకోవాలనుకుందిట. సినిమాలు హిట్ అవ్వకపోవడంతో మానసింగా కృంగిపోయిందిట. ఒకదాని వెంట మరొకటి ప్లాప్ అవ్వడంతో ఏం చేయాలో పాలుపోక? మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిపింది.
ఈ క్రమంలోనే ఇంటి టెర్రస్ పైకి ఎక్కి దూకేయాలనుకుందట. చివరికి కౌన్సింగ్ లింగ్ తీసుకోవడంతో ఆ ఒత్తిడిని జయించి బయట పడినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. చిన్న సమస్యకే అంత పెద్ద నిర్ణయాలు తీసుకోవాలా? అంటూ నెటి జనులు నందిని రాయ్ సమస్యపై స్పందిస్తున్నారు.
సినిమాలు హిట్ అవ్వకపోతే జీవితం లో ఫెయిల్ అయినట్లు కాదని..ఇలాంటి చిన్న చిన్న వాటికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే అతి పెద్ద తప్పు. పరీక్షలో ఫెయిలైన విద్యార్ధులు సూసైడ్ చేసుకోవడం లాగే ఉంటుందంటున్నారు. కోరుకున్న జీవితం కోసం ఎంత కాలమైనా పోరాటం చేసే అంకిత భావం ఉండాలి. ఎలాగైనా సాధించాలి అన్న కసి పట్టుదల ఉండాలి. ప్రయత్నిస్తూ మరణిస్తే ఆ లక్ష్యం చేరుకున్నట్లే. అదే సక్సెస్ అవ్వలేదని మరణిస్తే అంతకన్నా పెద్ద ఫెయిల్యూర్ మరొకటి ఉండదని గుర్తించాలి.