Begin typing your search above and press return to search.

చిన్నదానికి కలిసిరావడం లేదు

By:  Tupaki Desk   |   23 Jun 2018 9:35 AM GMT
చిన్నదానికి కలిసిరావడం లేదు
X
తమిళ సినిమాలు ఎన్ని చేసినా సౌత్ హీరోయిన్లకు తెలుగులో పేరు వస్తే ఆ కిక్కే వేరు. అందుకే నయనతార లాంటి టాప్ కోలీవుడ్ హీరోయిన్స్ సైతం ఏ మాత్రం అవకాశం దొరికినా మన హీరోల సరసన అవకాశం వదులుకోవడం లేదు. కాకపోతే దానికి టైం కలిసి రావాలి. మూడేళ్లుగా దాని కోసం ఎదురు చూస్తోంది నందిత శ్వేత. నిఖిల్ ఎక్కడికి పోతావా చిన్నవాడలో కీలకమైన పాత్రలో మంచి పెర్ఫార్మన్స్ తో మెప్పించిన నందిత ఆ తర్వాత మాత్రం తెలుగులో ఆఫర్స్ లేక తమిళ్ కే పరిమితమయ్యింది.

దానికి కారణం లేకపోలేదు. మొదటి సినిమాలో ఎంత బాగా నటించినా అది గ్లామర్ పాత్ర కాకపోవడంతో పాటు హారర్ ఛాయలు ఉండటం తనకు మైనస్ గా నిలిచింది. దెబ్బకు అన్ని ఉన్నా అందుకోలేని పరిస్థితిలో నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. తాజాగా నందిని శ్వేతా చేస్తున్న మూవీ ప్రేమ కథా చిత్రమ్ 2. దీని మీద ఆశలు పెట్టేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది కూడా హారర్ మూవీనే కాబట్టి. ఫస్ట్ పార్ట్ తీసిన నిర్మాత సుదర్శన్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. హైప్ పరంగా మితిమీరిన అంచనాలు అయితే దీని మీద లేవు. కామెడీ హారర్ జానర్ సినిమాలకు ఆదరణ తగ్గిన నేపథ్యంలో ఒక టైంలో వాటికి ఊతమిచేసిన ప్రేమ కథ చిత్రమ్ సీక్వెల్ అనే ఒక్క పాయింట్ తప్ప ఇంకే బజ్ దీని మీద లేదు.

కాకపోతే తమిళ్ వరకు నందిత శ్వేతా పరిస్థితి కొంత బెటర్ గా ఉంది. ఎస్ జె సూర్య హీరోగా రూపొందుతున్న మరో హారర్ నెంజమ్ మరపతిలైతో పాటు విజయ్ సేతుపతితో ఇదం పొరుళ్ ఎవల్ అనే మూవీ చేస్తోంది. ఇవి కాకుండా ట్రియో, అసురవధం నిర్మాణంలో ఉన్నాయి. తెలుగు లో పెద్ద బ్రేక్ రావాలంటే ఏదైనా పెద్ద సినిమా పడితే తప్ప నందిత ఆశ నెరవేరేలా లేదు.