Begin typing your search above and press return to search.
అక్షర.. నీ పేరు ప్రేమ దేశమా క్లాసిక్ గా
By: Tupaki Desk | 3 Nov 2019 4:21 AM GMT`ఎక్కడికి పోతావు చిన్నవాడా` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నందితా శ్వేత. ఈ సినిమాతో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్నా ఆ తరువాత చేసిన సినిమాలేవీ నందితకు విజయాల్ని అందించలేకపోయాయి. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం `అక్షర`. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. `లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో ఆకట్టుకున్న శ్రీతేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నటులు మధునందన్- సత్య సహా ఇంకా ఇందులో ఎందరో నటులు కనిపిస్తున్నారు. హాస్య నటుల ప్రాధాన్యత ఎక్కువగానే ఉందని అర్థమవుతోంది.
సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఓ మెలోడీ సాంగ్ లిరికల్ టీజర్ ని చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. `కనులను కాపలాగ వుంచా.. నీ పేరు ప్రేమ దేశమా..మనసుకు తలుపులన్ని తెరిచా.. నీ ప్రేమకింత అందమా..` అంటూ యువ గేయ రచయిత బాలాజీ రాయగా అనుదీప్ దేవ్ ఆలపించిన ఈ పాట మెలోడియస్‌గా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ఆర్టిస్టులందరినీ పరిచయం చేయడం ఆసక్తికరం. మధునందన్.. సత్య పాత్రలకు ఈ చిత్రంలో ఎంతో ప్రాధాన్యత ఉందని అర్థమవుతోంది.
బాలాజీ సాహిత్యానికి తగ్గ రీతిలో సురేష్ బొబ్బిలి అందించిన స్వరాలు పాటకు మరింత బలాన్ని చేకూర్చాయి. మంచి సాహిత్యం.. సంగీతంల కలబోతగా వున్న ఈ పాట సినిమాకు ప్లస్‌గా మారే అవకాశం వుంది. ఈ సినిమాతో దర్శకుడు చిన్నికృష్ణకు.. హీరోయిన్ నందితా శ్వేతకు మంచి హిట్ పడుతుందేమో చూడాలి. సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సురేష్ వర్మ అల్లూరి- అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సోషల్ మెసేజ్ తో కూడిన కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. టీజర్ ఇప్పటికే జనాల్లోకి దూసుకెళ్లింది.