Begin typing your search above and press return to search.

ఓయ్‌ పిల్ల.. బరువు తగ్గించాలమ్మో..

By:  Tupaki Desk   |   11 Jun 2015 5:00 PM IST
ఓయ్‌ పిల్ల.. బరువు తగ్గించాలమ్మో..
X
నావి బాతుగుడ్డు కళ్లు. వీటికి బోలెడంత ఫాలోయింగ్‌ ఉంది తెలుసా? అంటూ తెలుగు యువత మనసు దోచింది నందిత. ప్రేమకథా చిత్రమ్‌ విజయంతో ఈ అమ్మడి దశ దిశ తిరిగిపోయాయి. ఇటు తెలుగుతో పాటు, అటు మలయాళం, తమిళంలోనూ అవకాశాలొస్తున్నాయి. అన్నిచోట్లా బిజీ నాయికగా మారిపోతోంది.

ఎన్ని భాషల్లో నటించినా తెలుగును మాత్రం మర్చిపోకుండా ఇక్కడ అవకాశం వస్తే ఒడిసిపట్టుకుంటోంది. లవర్స్‌, రామ్‌లీల, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ.. వంటి సినిమాలతో ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే వీటిలో లవర్స్‌ తప్ప మిగతా రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దాంతో కొంత నిరాశ ఎదురైంది. అయినా ఇప్పటికే ఫిలింసర్కిల్స్‌లో తన పేరు మార్మోగిపోతోంది కాబట్టి కెరీర్‌కి ఢోఖా లేదు. ఇదిగో ఇటీవలే 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' ప్రమోషన్స్‌లో భాగంగా కెమెరా కళ్లకు చిక్కిందిలా.

నందిత కాదు నమిత అన్నంత రేంజులో బొద్దెక్కిపోయింది. తిండి విషయంలో అస్సలు నోరు కట్టేసుకోకుండా దొరికిందల్లా తినేస్తోందేమో! ఇదిగో ఇలా బొద్దుగుమ్మలా తయారైంది. ఇదే పరిస్థితి కొనసాగితే మునుముందు అమ్మిరాజు అంత అయిపోవడం ఖాయం. అప్పుడు అవకాశాలు ఇవ్వమన్నా ఇవ్వరు. కాబట్టి ముందుగానే కాస్త జాగ్రత్తపడుతుందేమో చూడాలి.