Begin typing your search above and press return to search.

సినీ కెరీర్ చిత్రం.. ఇంకా పూర్తి కాలేదట

By:  Tupaki Desk   |   14 Jan 2017 10:44 AM IST
సినీ కెరీర్ చిత్రం.. ఇంకా పూర్తి కాలేదట
X
నీకు నాకు డాష్ డాష్ అంటూ తేజ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన బ్యూటీ నందిత. ఈ మూవీ నిరుత్సాహపరిచినా.. రెండో సినిమా ప్రేమ కథా చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ ను తెగ ఎట్రాక్ట్ చేసి.. వరుస ఆఫర్స్ పట్టేసింది. కానీ.. రీసెంట్ గా వచ్చిన సినిమాలేవీ ఈమె కెరీర్ ను నిలబెట్టలేకపోయాయి. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ.. శంకరాభరణం.. సావిత్రి అంటూ వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కోవడంతో నందిత కెరీర్ కష్టాల్లో పడిపోయింది.

మధ్యలో ఓ మలయాళ మూవీ ట్రయల్ వేసినా సక్సెస్ కాలేదు. దీంతో ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేయాలని నందిత ఫిక్స్ అయిందంటూ వార్తలు వచ్చేశాయి. తను ఎన్నో హోప్స్ పెట్టుకున్న సినిమాలు కూడా ఆడకపోవడం.. ప్రస్తుతం అవకాశాలు రావడం కష్టం అయిపోవడం.. పైగా స్క్రిప్ట్ ఎంపికలో ఈమెకు స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం లాంటి కారణాలతో.. కొత్త ఛాన్సులు ఏవీ రావడం లేదు. ఇక మూవీస్ కి ఫుల్ స్టాప్ పెట్టేయనుందనే పుకార్లు బయలుదేరాయి.

అయితే.. ఈ రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసింది నందిత. తాను ఎప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంటానని.. తాను యాక్టింగ్ ఆపేస్తాననే వార్తలన్నీ రూమర్సేనని తేల్చేసింది నంది. దయచేసి ఇలాంటి పుకార్లు నమ్మద్దంటూ.. రిక్వెస్ట్ కూడా చేసిన నందిత.. తనకు స్క్రిప్ట్ నచ్చితే మాత్రం కచ్చితంగా సినిమా చేస్తా అంటోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/