Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: చిలిపి నవ్వుతో వెంటాడకలా
By: Tupaki Desk | 14 Aug 2018 4:12 AM GMTఎక్కడికిపోతావు చిన్నవాడా? .. అంటూ హీరో నిఖిల్ వెంటపడుతూ ఒక అందమైన దెయ్యం ఆడిన వింతాట తెలుగు ప్రేక్షకులకు పిచ్చిగా నచ్చేసింది. అందుకే ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రేమకోసం.. ప్రేమికుడి కోసం వెంటాడి వేదించే దెయ్యం పాత్రలో నందిత అభినయం కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. మనిషన్న వాడికి ఇలాంటి ప్రేయసి తగలకూడదన్నంత భయపడేలా చేయడంలో నందిత పెద్ద సక్సెసైంది. ఆ ఒక్క సినిమా ఈ బ్యూటీకి బోలెడంత గుర్తింపు తెచ్చింది. అందానికి అందం - నటనలో ఈజ్ జనం గుండెల్లో అలానే నిలిచిపోయాయి. రీసెంటుగా రిలీజైన `శ్రీనివాస కళ్యాణం` చిత్రంలో నందిత శ్వేత మరో వైవిధ్యమైన పాత్రలో ఆకట్టుకుంది.
అదంతా అటుంచితే.. నందిత అందచందాలపై కుర్రకారులో నజర్ ఓ రేంజులో ఉందిప్పుడు. ఈ భామ ఎక్కడ కనిపించినా తన కోసం పడి చచ్చే ఫాలోయింగ్ కనిపిస్తోంది. చూడగానే మతి తప్పే ఆ స్మైల్ తనకు ప్రత్యేక ఆకర్షణ. చిలిపిగా నవ్వేస్తూ కొంటెగా వాటిని కుర్రాళ్లపైకి రువ్వేస్తుంటుంది. ఆ కళ్లలో మెరుపులు అంతే మైమరిపిస్తాయి. ఆ ముగ్ధమనోహర రూపానికి స్పెల్ బౌండ్ అయిపోవాల్సిందే.
ఇదిగో ఇక్కడ బంగారు వర్ణం డిజైనర్ డ్రెస్ లో ఇంకా తళతళలాడిపోతోంది. ఆ చేతి వేళ్లకు ఎరుపురంగు ఫాలిష్ పెట్టుకుని - అందుకు తగ్గట్టే టాప్ టు బాటమ్ ఈ అమ్మడు సేమ్ కలర్ ఆభరణాల్ని ధరించింది. చేతి వేలి ఉంగరం నుంచి - చెవి లోలాకు వరకూ ప్రతిదీ ఒకే రంగువి ఉపయోగించి గ్లింప్స్ మరింత పెంచింది. ఆ చింతాకు కళ్లతోనే బోలెడంత మ్యాజిక్ చేస్తోంది నందిత. నందిత శ్వేత ప్రస్తుతం తమిళ్ - హిందీ పరిశ్రమలపైనా దృష్టి సారించింది. తమిళంలో ఓ రెండు సినిమాలు - హిందీలో ఓ సినిమాకి సంతకం చేసింది. అయితే తెలుగులో కంబ్యాక్ ఇప్పట్లో లేనట్టేనని అర్థమవుతోంది.