Begin typing your search above and press return to search.
టాలీవుడ్ ఆ భామను కాదంటుందా?
By: Tupaki Desk | 28 Oct 2017 1:30 AM GMTటాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కన్నా ఇతర భాషల హీరోయిన్స్ ఎక్కువగా ఉంటారనే విషయం అందరికి తెలిసిందే. ఒక్క సినిమాతో హిట్ అందుకుంటే చాలు ఆ తర్వాత జయపజయలతో సంబంధం లేకుండా అవకాశాలను దక్కించుకుంటారు. ప్రస్తుతం మలయాళీ భామల హవా బాగానే కొనసాగుతోంది. సౌత్ లో వారికి డిమాండ్ చాలా ఉందనే చెప్పాలి. ఇక కన్నడ నటీమణులు కూడా వారి టాలెంట్ తో బాగానే రానిస్తున్నారు.
కానీ ఒక బెంగుళూర్ భామ మాత్రం సౌత్ లో అన్ని బాషలని కవర్ చేస్తోంది. గాని టాలీవుడ్ లో మాత్రం అంతగా అవకాశం దక్కించుకోవడం లేదు. కొంత మంది హీరోయిన్స్ అదృష్టం ఏమిటోనగాని ఎంత అందంగా ఉన్నా అవకాశాలను అందుకోరు. నిఖిల్ - ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాతో స్పెషల్ రోల్ చేసి ఆకట్టుకున్న నందిత శ్వేతా అందరిని ఆకర్షించింది. అమ్మడు కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కి సైతం గట్టి పోటీని ఇస్తోంది.
కానీ తెలుగులో ఒక్క సినిమాతో హిట్ అందుకున్నా కూడా నందిత మరో అవకాశం దక్కించుకోలేదు. తెలుగులో గతంలో మంచి హిట్స్ అందుకున్న హీరోయిన్స్ కూడా ఎక్కువగా అవకాశాల్ని దక్కించుకోలేదు. ముఖ్యంగా అవికా గోర్ - హెబ్బా పటేల్ లాంటి భామలు నాలుగైదు సినిమాలకే పరిమితం అయ్యారు. అయితే ప్రస్తుతం నందిత చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలతో హిట్ అందుకోని టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుందో లేదో చూడాలి.