Begin typing your search above and press return to search.

మహేష్ తో నటించడమే టార్గెట్

By:  Tupaki Desk   |   29 Nov 2015 12:10 PM IST
మహేష్ తో నటించడమే టార్గెట్
X
ప్రేమ కథా చిత్రమ్ చూసిన ఎవరైనా సరే.. నందితను మర్చిపోవడం జరగదు. దెయ్యం పట్టిన అమ్మాయిగా అంతలా జీవించేసింది ఈ పిల్ల. మరో వారంలో రిలీజ్ కానున్న శంకరాభరణంలో నిఖిల్ కి జంటగా నటించింది నందిత. ఈ భామకి క్రేజ్ బాగానే ఉన్నా.. సినిమాలు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. కాని చిన్న చిత్రాలైనా చేసినవన్నీ క్రేజీ ప్రాజెక్టులు కావడం విశేషం.

ప్రస్తుతం శంకరాభరణం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది నందిత. ఎక్కువగా మీడియాలో కనిపించని ఈ సుందరి.. ఇప్పుడు తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాలు చేస్తుండడంతో.. ఇలా కౌంట్ తక్కువగా ఉందంటోంది నందిత. తన మొదటి సినిమా నీకూ నాకూ డ్యాష్ డ్యాష్ ఫెయిల్ కావడానికి కారణం.. మొదట ఆ మూవీ టైటిల్ కి వచ్చిన బ్యాడ్ నేం అంటోంది.

హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తానని.. ప్రియాంక చోప్రా అంటే చాలా ఇష్టమని, ఫ్యాషన్ బర్ఫీ తరహాలో ఛాలెంజింగ్ రోల్స్ చేయడం తన లక్ష్యమని నందిత చెబుతోంది. ఇక హీరోల్లో అయితే మహేష్ బాబుతో నటించడమే కోరికట. "మహేష్ నా ఫేవరేట్ హీరో, అసలు సూపర్ స్టార్ తో నటించాలని ఏ హీరోయిన్ కి ఉండదు " అంటూ ఎదురుప్రశ్నలు కూడా వేస్తోంది. అవును అది కూడా నిజమే కదా.