Begin typing your search above and press return to search.
సైలెంట్ గా కానిచ్చేస్తున్న నందు
By: Tupaki Desk | 28 Jun 2016 6:53 AM GMTఅప్పుడప్పుడు హీరోగా వేషాలు... మధ్య మధ్యలో నెగిటివ్ షేడ్స్ వున్న రోల్స్ వేస్తూ టాలీవుడ్ యువ నటుల్లో తన కంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు నందు. నటుడిగా కంటే... సింగర్ గీతా మాధురి భర్తగా బాగా పాపులర్ నందు. ఆమెకున్న పిచ్చ ఫాలోయింగ్.. నందు సినిమాలను ఆదరిస్తారనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో బాగానే వుంది. అయితే నందు మాత్రం సొంతంగానే తన ఇమేజ్ ను బిల్డప్ చేసుకోవాలని నిరంతరం శ్రమిస్తున్నాడు. కొద్దికాలం పాటు సైలెంట్ గా వున్న నందు.. ఇటీవలే ఓ కొత్త సినిమాలో నటించడానికి ఒప్పేసుకున్నారు.
ఈ చిత్రం ప్రారంభమైంది మొదలు సెట్స్ పైకి వెళ్లిపోయి అప్పుడే మొదటి షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసేసుకుంది. ఈ చిత్రంలో నందు సరసన కన్నడ భామ తేజశ్విని ప్రకాష్ నటిస్తోంది. ఈ అమ్మడు ఇటీవలే 2016 సంవత్సరానికి గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ సైమా అవార్డును గెలుచుకుంది. కన్నడలో నటించిన ‘గూలిహత్తి’ అనే సినిమాకు ఈ అమ్మడుకి ఈ అవార్డు రావడం విశేషం. ఇప్పుడు నందుతో కలిసి ‘కన్నుల్లో నీ రూపమే’ అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. మెయినాబాద్ పరిసర ప్రాంతాల్లో నందు - తేజశ్వినిలపై 12 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు బిక్స్. ఎస్.ఎస్.పి.క్రియేటివ్ ఆర్ట్స్ పతాకంపై భాస్కర్ బాసాని ఈ అందమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాకేత్ సంగీతం అదిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ ఇ.రాజమౌళి.