Begin typing your search above and press return to search.

ఒక్క క్ష‌ణం గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాం నందూ!

By:  Tupaki Desk   |   21 Dec 2022 4:31 AM GMT
ఒక్క క్ష‌ణం గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాం నందూ!
X
టాలీవుడ్ లో హీరోగా ఎద‌గాలంటే ఎలాంటి సినీనేప‌థ్యం అవ‌స‌రం లేద‌ని మాస్ మ‌హారాజా ర‌వితేజ‌- నేచుర‌ల్ స్టార్ నాని- న‌వీన్ పోలిశెట్టి- అడివి శేష్- నిఖిల్- సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌ వంటి స్టార్లు నిరూపించారు. నేటి జ‌న‌రేష‌న్‌ హీరోల్లో నందు నేప‌థ్యం గురించి తెలిసిందే. అత‌డికి ఇండ‌స్ట్రీ నేప‌థ్యం లేదు. స్వ‌యంకృషితో ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. కెరీర్ ప‌రంగా ఎదిగేందుకు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ సింగ‌ర్ గీతామాధురిని ప్రేమించి పెళ్లాడిన స‌దరు యువ‌హీరోకి కొంత‌ ఫాలోయింగ్ కూడా ఉంది. న‌టుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తూ నందు త‌న ప్ర‌య‌త్నం మాత్రం విడువ‌డం లేదు.

ఇక ఇత‌ర హీరోల‌తో పోటీప‌డాలంటే చాలా హార్డ్ వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అత‌డు త‌న లుక్ ని యాక్ష‌న్ ఇమేజ్ కి స‌రిపోయేలా మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. జిమ్ లో నిరంత‌రం క‌స‌ర‌త్తులు చేస్తూ రెండేళ్లుగా అత‌డు క‌ఠోరంగా శ్ర‌మించాడు. అత‌డి సోషల్ మీడియాలో నిరంత‌రం త‌న బాడీ మేకోవ‌ర్ గురించిన ఫోటోల‌ను షేర్ చేస్తున్నాడు. ఇవ‌న్నీ న‌వ‌త‌రంలో వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా నందు షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ గాళ్స్ లోకి దూసుకెళ్లింది. నందు బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు రా అండ్ ర‌స్టిక్ గా మారింది.

బాగా పెరిగిన మ‌జిల్స్ పొంగిన న‌రాలు లాగేసిన ద‌వ‌డ‌లు.. ఇదంతా చూస్తుంటే ఒక్క క్ష‌ణం అత‌డు నందు యేనా? అంటూ కంగారు ప‌డ్డారు ఫ్యాన్స్. ఇంత‌కీ ఈ నందుకి ఏమైంది? అంటూ స‌ర‌దాగాను ఆట‌పట్టిస్తున్నారు నెటిజ‌నం. ఒక్క క్ష‌ణం గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాం నందూ! అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించ‌గా..కండ‌ర‌గండ‌! ఇంత‌కీ ఈ నందూకి ఏమైంది? అంటూ మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. నందు సూప‌ర్ మ్యాకో లుక్ కి గాళ్స్ ధిమాక్ ఖ‌రాబ్! అంటూ మ‌రొక నెటిజ‌నుడు స‌ర‌దాగా వ్యాఖ్య‌ను జోడించారు.

ఏది ఏమైనా దీనికోసం అత‌డు చాలా క‌ఠిన నియ‌మాల‌ను అనుస‌రిస్తూ అహోరాత్రులు శ్ర‌మించాడ‌ని అర్థ‌మ‌వుతోంది. కాంపిటీష‌న్ లో దూసుకెళ్లాలంటే నటుడు త‌న‌లోని విల‌క్ష‌ణ‌త‌తో పాటు ఫిట్ నెస్ ని నిరూపించాల్సి ఉంటుంది. ఆ విభాగంలో అత‌డి కృషి అభినంద‌నీయం.

ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవ‌ల అత‌డు ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల్ని ఎంచుకుని కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఫ్యాన్ బేస్ ని పెంచుకోవాల‌ని య‌త్నిస్తున్నాడు. మ‌రోవైపు బుల్లితెర‌పై స్టార్ స్పోర్ట్స్ హోస్ట్ గానూ నందు రాణించాడు. ఇంత‌లోనే 'స‌వారి' అంటూ ఇటీవల ఆస‌క్తిక‌ర కాన్సెప్టునే ట్రై చేశాడు. బాద్ షా అనే గుర్రానికి కేర్ టేక‌ర్ గా ఉండే సాధాసీధా రాజు గా .. రిచ్ గాళ్ ని ప్రేమించే కుర్రాడిగా క‌నిపించాడు. మూవీ జ‌యాప‌జ‌యాల‌తో ప‌ని లేకుండా న‌టుడిగా నందుకి మంచి మార్కులే వేసారు క్రిటిక్స్. అటుపై 'బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్' అనే టైటిల్ తో ఆస‌క్తిని పెంచాడు.

జ‌మీందార్ లా ఒళ్లంతా బంగారు ఆభ‌ర‌ణాలు ఖ‌రీదైన కాస్ట్యూమ్ తో క‌నిపించాడు. ఇందులో అత‌డు పోతురాజుగా నటించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. మునుముందు నందు ప్ర‌య‌త్నం ఏమిట‌న్న‌ది ఇంకా స్ప‌ష్ఠంగా తెలీదు. అత‌డు త‌న త‌దుప‌రి సినిమాల గురించి వెల్ల‌డించాల్సి ఉంది. న‌వ‌త‌రంలో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని నిరూపించాలంటే సిద్ధూ డీజే టిల్లు లా అత‌డు కూడా ఏదైనా ఒక మ్యాజిక‌ల్ హిట్ ని అందుకోవాల్సి ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.