Begin typing your search above and press return to search.
`రివెంజ్ ఎంటర్ టైనర్` అర్థం తెలుసా?
By: Tupaki Desk | 26 Aug 2019 6:03 AM GMTఫ్యామిలీ ఎంటర్ టైనర్.. యాక్షన్ ఎంటర్ టైనర్.. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అంటూ రకరకాల ఎంటర్‌టైనర్‌ల గురించి తెలుసు కానీ.. `రివెంజ్ ఎంటర్ టైనర్` గురించి తెలుసా? అంటే ఈ సౌండింగ్ విన్నది తక్కువే. వెంజ్ డ్రామాలు చాలా చూశాం కానీ రివెంజ్ లో ఎంటర్ టైన్ మెంట్ అంటే కాస్త కొత్తగానే వినిపిస్తోంది. అందుకే `నాని` స్ గ్యాంగ్ లీడర్` చిత్రాన్ని విక్రమ్.కె మునుపటి కంటే కాస్త కొత్తగానే ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. అసలింతకీ `రివెంజ్ ఎంటర్ టైనర్` అంటే ఏమిటి? అంటే.. నాని ఇచ్చిన డెఫినిషన్ కంటే ముందే అమెరికన్ రైటర్ కం డైరెక్టర్.
వినోదానికి రివెంజ్ ని కలిపితే రివెంజ్ ఎంటర్ టైనర్ అంటూ నాని ఒక కొత్త డెఫినిషన్ ఇచ్చారు. ఇన్నాళ్లు ఎన్నో రివెంజ్ డ్రామాలు చూసిన ఆడియెన్ కి ఇదో కొత్త తరహా అనుభూతిని మిగులుస్తుందని అన్నారు. ``ఇది రివేంజ్ ఎంటర్ టైనర్ అనే కొత్త జోనర్ ఉండే సినిమా. ఈ సినిమాలో మా గ్రూప్ పేరు రివెంజర్స్ అసెంబుల్డ్. తప్పకుండా అలరిస్తాం`` అంటూ కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశారు. అయితే అసలు ఈ రివెంజ్ ఎంటర్ టైనర్లకు స్ఫూర్తి ఎక్కడ ఉంది? అని వెతికితే ఈ తరహా ఫ్రెంచి సినిమా.. యూరోపియన్ సినిమాల్లో ఎక్కువగానే కనిపిస్తుంటాయి.
కథని డ్రైవ్ చేస్తూనే బోలెడంత ఫన్ ని జోడిస్తూ ఉన్నట్టుండి రివెంజ్ తీర్చుకోవడాలు అన్న కాన్సెప్టుతో ఇదివరకూ చాలానే సినిమాలు వచ్చాయి. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్- ది పల్ప్ ఫిక్షన్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్ని తెరకెక్కించిన క్వెంటిన్ జెరోమ్ టొరెంటినో ఈ తరహా సినిమాల్ని తెరకెక్కించారు. ఈ అమెరికన్ రైటర్ కం డైరెక్టర్ తెరకెక్కించిన కథలేవీ స్ట్రెయిట్ నేరేషన్ తో ఉండవు. వంకర టింకరగా ఎంతో ఫన్ ని జనరేట్ చేస్తూ సెటైరికల్ గానూ ఉంటాయి. ఇప్పుడు నాని నటించిన `నాని స్ గ్యాంగ్ లీడర్` అదే తరహా కాన్సెప్ట్ అని చెబుతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ లో బోలెడంత ఫన్ వర్కవుటైంది. ప్రస్తుతం తెలుగు ఆడియెన్ కొత్త జోనర్ సినిమాలపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఫన్ ఎంటర్ టైన్ మెంట్- రివెంజ్ ఫార్మాట్ ఆల్ టైమ్ సక్సెస్ ఫుల్ ఫార్ములా. మరి నానిస్ గ్యాంగ్ లీడర్ లో అది ఎంతవరకూ వర్కవుటైంది అన్నది చూడాలి. సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.