Begin typing your search above and press return to search.
ఈ సమయంలో అంతా నానిలా ఉండాలి
By: Tupaki Desk | 4 Sep 2020 8:00 PM GMTఅసలే నటీనటులు టెక్నీషియన్స్ పారితోషికాలు విపరీతంగా పెరిగి పోయి బడ్జెట్ విపరీతంగా పెరిగి పోయిన నేపథ్యంలో నిర్మాతలకు సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా లాభాలు వస్తున్న పరిస్థితి లేదు. మూలిగే నక్క మీద తాడి పండు అన్నట్లుగా కరోనాతో నిర్మాతలు మరింత కుదేలయ్యారు. ఈ సమయంలో నిర్మాతలు బతికి బట్ట కట్టాలంటే నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు కాస్త కనికరం చూపించాలి. వారి పారితోషికాలు తగ్గించుకుని సినిమా మేకింగ్ కు ముందుకు రావాలి. అప్పుడే నిర్మాతలు మళ్లీ కోలుకునే అవకాశం ఉంది. అయితే ఎంత మంది హీరోలు ఈ సమయంలో వారి పారితోషికాలు తగ్గించుకుంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఈ విషయమై నాని మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ముఖ్యంగా హీరోలు ఈ సమయంలో తక్కువ పారితోషికం తీసుకోవాలి లేదంటే తీసుకున్న పారితోషికంలో కొంత మొత్తంను అయినా తిరిగి వెనక్కు ఇవ్వాలి. సినిమాకు నిర్మాత పెట్టుబడి కూడా రానప్పుడు హీరో తన పారితోషికం మొత్తంను కూడా త్యాగం చేయవచ్చు అంటూ నాని కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చాడు. నిర్మాతకు ఏం మిగలడం లేదు అన్నప్పుడు పారితోషికం మొత్తం వెనక్కు ఇవ్వడంకు వెనకాడకూడదు అన్నాడు.
నిర్మాతల విషయంలో నాని ఇంతగా ఆలోచించడం అభినందనీయం. ఆయన నిర్మాతల శ్రేయస్సు కోరి ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇలాగే ప్రతి హీరో కూడా నానిలా ఆలోచిస్తే నిర్మాతలకు కొంత మేరకు అయినా ఉపశమనం పొందుతారు అనడంలో సందేహం లేదు. నాని పారితోషికం తగ్గింపు నిర్ణయాన్ని ఎంత మంది హీరోలు స్వాగతిస్తారు అనేది చూడాలి.