Begin typing your search above and press return to search.
సాయిపల్లవికి కాస్త డౌట్లు ఎక్కువే: నాని
By: Tupaki Desk | 21 Dec 2021 2:30 PM GMTనాని ఇంతకుముందు చాలా సినిమాలు చేశాడు .. ఆ సినిమాలకి సంబంధించిన ప్రమోషన్స్ లో మాట్లాడాడు. అయితే ఈ సారి మాత్రం 'శ్యామ్ సింగ రాయ్' విషయంలో కాన్ఫిడెంట్ పాళ్లు కాస్త ఎక్కువగానే కనబరుస్తున్నాడు. దగ్గర్లో పెద్ద సినిమాలు ఉన్నా ఇంచు భయం లేదంటున్నాడు .. ఈ క్రిస్మస్ మనదే అనే నినాదాన్ని భుజాన వేసుకుని వెళుతున్నాడు.
ఏదైనా సాధించిన తరువాత సూట్ వేసుకోవచ్చనుకుని బీరువాలో పెట్టేసిన తాను, ఈ సినిమా చూసిన తరువాత వేసుకున్నానని మరీ చెప్పాడు. ఇదంతా చూస్తుంటే నిజంగానే ఈ సినిమాలో అంతుందా అనే ఆసక్తి .. సందేహం కలగడం సహజం. ఈ నెల 24వ తేదీనే ఈ సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో టీమ్ బిజీగా ఉంది.
తాజా ఇంటర్వ్యూలో నానికి గల ఈ కాన్ఫిడెన్స్ పైనే ఆయనకి ప్రశ్న ఎదురైంది. అప్పుడు ఆయన మాట్లాడుతూ .. "అన్ని సినిమాలను కూడా చాలా ఎగ్జైట్ అయిపోయి .. చాలా కాన్ఫిడెంట్ తో ఓకే చేయడం జరుగుతుంది. అయితే అన్ని సినిమాలకు అన్నీ కుదరవు .. కొన్ని సినిమాలకు అన్నీ కుదురుతాయి.
ఎన్ని కుదిరాయి .. ఎన్ని కుదర్లేదు అనే విషయం మాకు కరెక్టుగా రిలీజ్ కి ముందు తెలుస్తుంది. ప్రమోషన్స్ కి వెళ్లే ముందుకు మాకు ఒక ఐడియా వస్తుంది. అదే ఈ సినిమా విషయంలోను జరిగింది. నాకు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందన్నది మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది.
సాయిపల్లవిని గురించి నాని మాట్లాడుతూ .. "ఆమెకి అన్నీ డౌట్లే .. అందరూ బాగా చేసేస్తున్నారు .. నేను సరిపోయానా? డాన్సర్లంతా ప్రొఫిషినల్స్ .. నేను వాళ్లలా కాదు .. ఎలా అనుకుంటుంది. కానీ వాళ్లకంటే కూడా బాగా చేస్తుంది. ఇక ఈ సినిమాకి సిరివెన్నెల గారు చివరి పాటలు రాయడమనేది అదృష్టమా .. దురదృష్టమా అనేది నాకే తెలియదు.
ఆయనకి .. నాకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన నన్ను మెచ్చుకున్నాడని ఇప్పుడు నేను చెబితే ఎవరు ఏమనుకుంటారో. కానీ నా స్నేహితులకు .. ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రం చెప్పేసుకున్నాను.
నేను 'పైసా' సినిమా షూటింగులో ఉండగా నాకు ఆయన కాల్ చేశారు. తనదైన శైలిలో ఆయన నన్ను మెచ్చుకున్నారు. అప్పుడు వెంటనే నేను మా అక్కయ్య వాళ్లకి కాల్ చేసి ఆయన ఎలా మెచ్చుకున్నారనేది వాళ్లతో షేర్ చేసుకున్నాను. అప్పుడప్పుడు ఆయన నాకు కాల్ చేసి "మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు నాన్నా .. నేను మా మానవరాలు నీకు పెద్ద ఫ్యాన్స్ అని తెలుసుగా" అనేవారు. చిన్నప్పటి నుంచి ఆయన పేరు వింటున్నాను .. ఆయన పాటలు వింటున్నాను .. అలాంటి నాకు ఆయన అలా అనగానే ఎంతో ఎనర్జీ వచ్చేసేది.
ఒక రోజు రాత్రి 11:30 గంటలకు కృష్ణవంశీ గారు నాకు కాల్ చేసి .. శాస్త్రిగారికి ఫోన్ ఇస్తున్నానని చెప్పి ఆయనకి ఇచ్చారు. శాస్త్రిగారికి కృష్ణవంశీగారు దత్తపుత్రుడు లాంటివారు. తన సినిమా పూర్తయిన తరువాత ముందుగా శాస్త్రిగారికి చూపించడం ఆయనకి అలవాటు.
అలా 'పైసా' చూడగానే ఆయన నాకు కాల్ చేసి . "ఒరేయ్ నాన్న .. వంశీకి రాయి దొరికితే రత్నంలా మారుస్తాడు .. ఇక రత్నమే దొరికితే" అన్నారు. ఈ సినిమా సమయంలో కూడా ఆయన 'నేను ఒక్కరికే ఫ్యాన్ ని .. అది నానీకి' అని అంతటి శాస్త్రి గారు అనడంతో నాకు కడుపునిండిపోయింది" అని చెప్పుకొచ్చాడు.