Begin typing your search above and press return to search.
క్రిస్మస్ మాత్రం మనదే అంటున్న సింగరాయ్
By: Tupaki Desk | 7 Nov 2021 1:30 PM GMTకెరీర్ ఆద్యంతం ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ లో అతడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అనగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది. టాక్సీవాలా ఫేం రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నానీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రమిది. క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబర్ లో సినిమా విడుదల కానుంది. ఇటీవల చిత్రబృందం ప్రమోషన్స్ లో వేగం పెంచిన సంగతి తెలిసిందే.
ఇందులో నేచురల్ స్టార్ ద్విపాత్రాభినయం ఒక హైలైట్ అనుకుంటే భారీ యాక్షన్ .. దానికి తగ్గట్టు హై బడ్జెట్ తో విజువల్ రిచ్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు ఎక్కడా రాజీకి రాకుండా ఈ సినిమాకి పెట్టుబడులు పెడుతున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి- కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. జెర్సీ ఫేమ్ సాను వర్గీస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. నిహారికా ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై వెంకట్ బోయనాపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా రైజ్ ఆఫ్ శ్యామ్ పాట విడుదలైంది. ఈ సాంగ్ ఆద్యంతం గూస్ బంప్స్ తెచ్చే థీమ్ ఆకట్టుకుంటోంది. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. రైజ్ ఆఫ్ శ్యామ్ అనేది ఒక కథానాయకుడు సమాజంలో చైతన్యం కోసం ఎలా పోరాడుతాడు? అన్న థీమ్ తో రాసుకున్నది అని వెల్లడించారు.
ఈ మూవీ గురించి దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ మాట్లాడుతూ.. శ్యాం సింగరాయ్ చాలా ప్రత్యేకత ఉన్న సినిమా అని తెలిపారు. ఆయన గురించి మాటలు సరిపోవు ..కమ్యూనిజంలో కనిపించే కోపం శ్యామ్ సింగరాయ్..బెంగాల్ భూమిపై మీసం తిప్పిన తెలుగోడు సింగరాయ్!.. అని అన్నారు.
అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఇదే వేదికపై నాని సమాధానాలిచ్చారు. చిరంజీవికి ఖైదీ ముందు ఖైదీ తర్వాత.. ప్రభాస్ కి బాహుబలి ముందు బాహుబలి తర్వాత.. అలాగే నానీకి శ్యామ్ సింగరాయ్ ముందు శ్యాంసింగరాయ్ తర్వాత అనుకోవచ్చా? అని ఓ అభిమాని ప్రశ్నించారు. దీనికి నానీ ఆసక్తికర ఆన్సర్ ఇచ్చారు. ``నానీకి అలా ఉండదు.. నానీకి ప్రతి సినిమా ముందు ప్రతి సినిమా తర్వాత!`` అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈసారి కొడుతున్నావ్ అన్నా అని అంటుంటారు. గ్యారెంటీగా.. కొట్టేసినట్టే .. ఇక్కడి నుంచి ప్రతి మెట్టు పైకే. నెక్ట్స్ లెవల్లోనే ఉంటుంది. ఇక్కడి నుంచి నా సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉంటాయి. మీ అంచాలు పెరిగినా దానిని మించి సినిమా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నాను అని అన్నారు నాని.
ఒక సినిమాని ఇన్వాల్వ్ అయి చేయడం వేరు.. శ్యామ్ సింఘరాయ్ ప్రపంచంలోకి వెళ్లిపోయి సినిమా చూసేంత పూర్తి విభిన్నమైన అనుభవం అవుతుంది. ఈ లుక్ కోసం చాలా కేరింగ్ తీసుకున్నారు. చాలా ఎఫెక్టివ్ మూవీ ఇది. మంచి స్క్రిప్టు వచ్చినప్పుడు అదే మనచేత చేయిస్తుంది... అని నాని సినిమా సంగతులు ముచ్చటించారు. ఈసారి క్రిస్మస్ మాత్రం మనదే అని నానీ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇదే క్రిస్మస్ కానుకగా బన్ని నటించిన పుష్ప విడుదలవుతున్న సంగతి తెలిసిందే