Begin typing your search above and press return to search.
మరీ సూట్లేసుకుని తిరగడానికి మనమేం పీకామని
By: Tupaki Desk | 19 Dec 2021 3:54 AM GMT'శ్యామ్ సింగ రాయ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి హైదరాబాద్ - శిల్ప కళావేదికలో జరిగింది. ఇంతవరకూ జరిగిన ఈ సినిమా ప్రమోషన్స్ లోను .. వరంగల్ లో జరిగిన రాయల్ ఈవెంట్ లోను మిస్ అయిన మడోన్నా సెబాస్టియన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైంది. ఇప్పటికే అసలు ఆమె ఈ సినిమాలో ఉందా లేదా అనే సందేహం తలెత్తుతోంది. స్టేజ్ పై నాని మాట్లాడటానికి సిద్ధమవగానే అభిమానులంతా ఉత్సాహంతో అరిచారు. ఆడిటోరియంలో అంతా ఈలలు .. అరుపులు. "మా టీమ్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి .. మీరు అవకాశం ఇస్తే" అంటూ నాని మొదలుపెట్టాడు.
"బ్లేజర్ బావుందా .. ఎప్పుడూ కూడా వైట్ షార్ట్ గానీ .. బ్లాక్ షర్ట్ గాని వేసుకుని వీడు ఈవెంట్స్ కి వస్తుంటాడని ఫాలోవర్లు అంటున్నారు. మా ఆవిడ ఒక పది బ్లేజర్లు కొంది. అవి ఎప్పుడు వేసుకోవాలో తెలియదు .. నేను వేసుకోలేదు .. నాకు ఆ ధైర్యం లేదు. అప్పుడప్పుడు బయటికి వెళ్లినప్పుడు వేసుకోమని చెబుతుంటే .. మరీ సూట్లేసుకుని తిరగడానికి మనం ఏం పీకామని. వద్దులే అని లోపలే పెట్టేశాను .. అవన్నీ దుమ్ము పట్టేశాయి.
ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్' చూసిన తరువాత తీసి వేసుకోవాలనిపించింది. ఈ రోజు ఈవెంట్ కి వేసుకోవచ్చని ధైర్యంగా అనిపించింది. ఇంతకు మించి సినిమా గురించి మళ్లీ మళ్లీ చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాకి కేవలం ఐదురోజుల దూరంలో ఉన్నాము. మా టీమ్ అందరి కళ్లలో ఉన్న ఆనందం ఎందుకు వచ్చింది .. ఎక్కడి నుంచి వచ్చిందనేది ఐదు రోజుల తరువాత మీకు అర్థమవుతుంది. ఇంతటి ప్రేమను అందిస్తున్న మీ అందరి కళ్లలో కూడా ఆ రోజున ఒక సంతృప్తి కనిపిస్తుంది.
చాలా మంచి సినిమాను మనం చేసి .. మనం చూసేసిన తరువాత, అది మీరు చూడటానికి కూడా ఎక్కువ గ్యాప్ ఉండకూడదనేది కూడా నాకు అర్థమైంది. ఎప్పుడెప్పుడు 24 వస్తుందా .. ఎప్పుడెప్పుడు మీరు ఈ సినిమాను చూస్తారా అనిపిస్తోంది. దాంతో ప్రతి గంట .. ప్రతి రోజు చాలా కష్టంగా గడుస్తోంది. మా టీమ్ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ .. సినిమాటోగ్రాఫర్ వర్క్ ఎంత బ్రిలియంట్ గా ఉందనేది మీరు 24న చూస్తారు. సాయిపల్లవి ఎందుకు ఇంత ఎమోషనల్ అయిందనే విషయం కూడా మీకు ఆ రోజునే అర్థమవుతుంది.
రాహుల్ గురించి ఈ సినిమాకి ఐదు రోజుల ముందుకు చెబితే సొంత డబ్బా కొట్టుకున్నట్టుగా ఉంటుంది. రాహుల్ సైడ్ నుంచి మీకు ఒక పెద్ద సర్ ప్రైజ్ ఉంది .. అంతవరకూ మాత్రమే చెప్పగలను. రాహుల్ గురించి ఇప్పుడు నేను చెప్పడం కాదు .. 24 తరువాత మీరే ఆయన గురించి నాకు చెబుతారు. నిర్మాతగా వెంకట్ బోయనపల్లి గారికి ఇది ఫస్టు సినిమా. ఇంతకాలం నుంచి ఆయన పడిన కష్టానికి .. పెట్టుకున్న నమ్మకానికి అన్నిటికీ కూడా తగిన ఫలితం దక్కుతుందని అనుకుంటున్నాను. ఎంతో దూరం నుంచి కష్టపడి మీరంతా ఇక్కడికి వరకూ వచ్చారు .. అందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ .. క్రిస్మస్ మాత్రం మనదే" అంటూ ముగించాడు.