Begin typing your search above and press return to search.

నిల‌బెట్టుకుంటాడా? చెడగొట్టుకుంటాడా?

By:  Tupaki Desk   |   26 Oct 2015 7:30 AM GMT
నిల‌బెట్టుకుంటాడా?  చెడగొట్టుకుంటాడా?
X
ఈగ‌తో ఎగిరాడు నాని! ఆ త‌ర్వాత మంచి హిట్లొచ్చాయి. అలా మొద‌లైంది లాంటి క్లాసిక్ హిట్ వ‌చ్చాక, పిల్ల జ‌మీందార్ లాంటి ఎంట‌ర్‌ టైన‌ర్‌ తో ఆక‌ట్టుకున్నాక త‌న రేంజు పెంచుకునే క్ర‌మంలో కొన్ని త‌ప్ప‌ట‌డుగులు కూడా వేశాడు. దాని ఫ‌లితం ఆ త‌ర్వాత అత‌డి కెరీర్‌ మీద తీవ్రంగా ప‌డింది. వ‌రుస ప‌రాజ‌యాలు అత‌డిని సంక్షోభంలోకి నెట్టేశాయి. అయితే ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం - భ‌లే భ‌లే మ‌గాడివోయ్ విజ‌యాల‌తో తిరిగి లైమ్‌ లైట్‌ లో కొచ్చాడు.

ముఖ్యంగా భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమా అత‌డికి బోలెడంత నేర్పించింది. ఆంజ‌నేయుడికి కూడా త‌న శ‌క్తి ఏమిటో వేరొక‌రు చెబితే కానీ తెలియ‌ద‌ని అంటారు. అలా మారుతి రూపంలో ఓ స‌రైన డైరెక్ట‌ర్ త‌గిలితే కానీ .. నానీకి కెరీర్ ప‌రంగా అవ‌గాహ‌న రాలేదు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ హ‌ద్దులు చేరిపేసింది. స‌రైన స్ర్కిప్టు ప‌డితే ఎలా ఉంటుందో ఈ సినిమాతో అర్థ‌మైంది. అస‌లు ఓవ‌ర్సీస్ అంటేనే స్టార్ హీరోల‌కు మాత్ర‌మే అనుకునేవారంద‌రికీ క‌ళ్లు తెరిపించింది భ‌లే భ‌లే విజ‌యం. దీంతో నాని స్టామినా ఒక్క‌సారిగా రెట్టింపయ్యింది. అత‌డి మార్కెట్ రేంజ్ ఒక్క‌సారిగా డ‌బుల్ అయ్యింది. ఇప్పుడున్న యంగ్ జ‌న‌రేష‌న్‌ లో స్టార్ హీరో అయ్యే స‌త్తా నానికి మాత్ర‌మే ఉంది అని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా చేసింది ఈ సినిమా.

తెలివైన ఎంపిక‌ల‌తో నాని మునుముందు వ‌రుస విజ‌యాలు ఇస్తూ జ‌నాల‌కు మ‌రింత చేరువ‌వ్వాలి. ఇమేజ్ అడ్డంకి లేదు కాబ‌ట్టి స్టార్ హీరోలంద‌రినీ ప‌క్క‌కు నెట్టేసే స‌త్తా కూడా నానీకే ఉంద‌న్న‌ది నిజం. మ‌రి నాని నిల‌బెట్టుకుంటాడా? లేక చెడ‌గొట్టుకుంటాడా?