Begin typing your search above and press return to search.
ఇలాగైతే కష్టమే నాని
By: Tupaki Desk | 21 Dec 2017 11:30 PM GMTఏమన్నా అంటే అన్నాం అంటారు కాని.. రోజూ అదే రొటీన్ సినిమాతో వస్తే ఎట్టాగబ్బా? ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని పరిస్థితి అలాగే ఉంది. రొటీన్ కథలతో ఫుల్ కామెడీని నింపేసి ఆ మధ్యన భలే భలే మగాడివోయ్.. నేను లోకల్ అంటూ భారీ హిట్లు కొట్టాడు. ఒక సినిమాతో 25+ కోట్లు వసూలు చేస్తే.. మరో సినిమాకు 34+ కోట్లు షేర్ వచ్చింది. అందుకని.. ఆ చెప్పండి.. అందుకుని.. అవే తీస్తారా? అంటున్నారు నెటిజన్లు.
నిజానికి ఎం.సి.ఏ సినిమా విషయంలో నాని చేసిన ప్రామిస్ లు.. దిల్ రాజు కొట్టిన పంచులు.. సిక్స్ కొడతా సిక్స్ కొడతా అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు వినేసరికి.. అందరూ సినిమా ఇరగాడేస్తుంది కాబోలు అనుకున్నారు. ఇక ఆడటం వసూలు చేయడం అనే విషయాలు పక్కన పెట్టేస్తే.. అసలు సినిమాలో కంటెంట్ బాగా డల్ అయిపోయింది అనేది మెజార్టీ ఆడియన్స్ ఉవాచ. కామెడీ గట్టిగా ఉంటే కథ లేకపోయినా సరిపోయేది.. కామెడీ కూడా లేకపోవడంతో.. కథ లేదనే విషయం తెలిసిపోయింది. అందుకే అటు మార్చి ఇటు మార్చి రేసుగుర్రం సినిమానే తీశారని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. పైగా.. ఎన్నాళ్ళని ఇలాంటి సినిమాలే చేస్తావ్ నాని? అంటూ సినిమా లవర్స్ ప్రశ్నించడం ఇప్పుడు మనం గమనించవచ్చు.
తనకంటూ ఒక మంచి మార్కెట్ ఇమేజ్ అన్నీ ఉన్నప్పుడు.. నాని వంటి హీరో తెలుగు సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నించవచ్చు. మలయాళంలో చేసే ప్రయోగాలు.. హిందీలో వచ్చి ఫారిన్ ప్రేమకథలు..లేదంటే ఆఫ్ బీట్ తరహా సినిమాలు. నాని అవేమన్నా ప్రయత్నిస్తే బాగుంటుందేమో అంటూ చాలామంది సూచనుల చేస్తున్నారు. చూద్దాం నాని ఎలా రియాక్ట్ అవుతాడో.