Begin typing your search above and press return to search.
నాని ఫిక్సయినట్టేనా... ?
By: Tupaki Desk | 21 Aug 2019 4:11 AM GMTగ్యాంగ్ లీడర్ కి సంబంధించి షూట్ ఫినిష్ చేసేసాడు నాని. ప్రస్తుతం సినిమాకు పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాతో సెప్టెంబర్ 13 న థియేటర్స్ లోకి రాబోతున్న లేటెస్ట్ గా ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'V' షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇందులో నెగిటీవ్ షేడ్స్ ఉండే ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాని కనిపించేది కాసేపే అయిన సినిమాకు కీలకం అని తెలుస్తుంది.
'V' తర్వాత నేచురల్ స్టార్ హను సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఆ మధ్య తన కోసం ఆర్మీ బ్యాగ్ డ్రాప్ లో హను ఓ కథను సిద్ధం చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు నాని. కానీ అనౌన్స్ మెంట్ రాలేదు. ఆ తర్వాత నాని వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. హను కూడా వరుస అపజయలతో సతమతమయ్యాడు. అయితే ఇప్పుడీ ఈ కాంబినేషన్ సినిమా సెట్ అయిందని సమాచారం. లేటెస్ట్ గా పడి పడి లెచే మనసుతో బోల్తా పడ్డ హను నాని సినిమాకు పూర్తి కథను సిద్ధం చేసాడట. నాని కూడా విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట.
నాని హను కాంబినేషన్ లో గతంలో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా వచ్చింది. కొన్ని అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది. ఇపుడు మళ్లీ ఈ కాంబో ఎలాంటి హిట్ డెలివరీ చేస్తుందా..? చర్చ నడుస్తోంది. మరి హను మళ్లీ నాని తో సినిమా చేసి హిట్ రేస్ లోకి వస్తాడేమో..చూడాలి.