Begin typing your search above and press return to search.
దేవదాసులు స్ఫూర్తి పొందారా?
By: Tupaki Desk | 8 Aug 2018 11:32 AM GMTనిన్న పక్కపక్కనే ఘాడ నిద్రలో ఉన్న ఫస్ట్ లుక్ తో నాగార్జున నానిల దేవదాస్ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. హంగామా హీరోయిజం లేకుండా వెరైటీగా ప్లాన్ చేసిన ఈ స్టిల్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది. కాకపోతే దీని వాలకాన్ని బట్టి చూస్తే ఇది 1999లో వచ్చిన అనలైజ్ థిస్ అనే ఇంగ్లీష్ సినిమా నుంచి స్ఫూర్తి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. రాబర్ట్ డీ నీరోతో బిల్లీ క్రిస్టల్ నటించిన ఈ మూవీ అప్పట్లో గ్యాంగ్ స్టార్ కామెడీగా మంచి పేరు తెచ్చుకుంది. అందులో కూడా ఇలాగే ఒక డాన్ పాత్ర ఒక డాక్టర్ పాత్ర ఉంటాయి. దేవదాస్ పాయింట్ ని అందులో నుంచి తీసుకుని తెలుగుకు తగ్గట్టు మార్పులు చేర్పులు ఏమైనా చేసారా అనే అనుమానాలు సోషల్ మీడియాలో సైతం వ్యక్తమవుతున్నాయి. కానీ టీజర్ వచ్చాక దీని గురించి ఒక అంచనాకు రావొచ్చు కానీ ఇప్పుడే ఒక కంక్లూజన్ కు రాలేం.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీకి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. కామెడీ మిక్స్ చేసిన థ్రిలర్స్ ను బాగా డీల్ చేయగలడని తన మొదటి రెండు సినిమాలు భలే మంచి రోజు-శమంతకమణిలతో ప్రూవ్ చేసుకున్న శ్రీరామ్ ఆదిత్య ఇద్దరు స్టార్ హీరోలను ఒకేసారి హ్యాండిల్ చేయటం ఇదే మొదటిసారి. అవుట్ ఫుట్ గురించి సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆ మధ్య కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. ఇప్పుడు ఇది స్ఫూర్తి చెంది తీస్తున్నారు అనే వార్త కూడా ఖంగారు పుట్టించేదే. అయినా ఇవన్నీ అధికారికంగా బయటికి వచ్చినవి కాదు కాబట్టి నిజానిజాల గురించి నిర్ధారణకు రాలేం. అసలే టాలీవుడ్ లో ఇలా స్ఫూర్తి చెందిన సినిమాలు అంతగా వర్క్ అవుట్ కావడం లేదు. ఈ నేపథ్యంలో దేవదాస్ మీద ఫాన్స్ టెన్షన్ పడటం సహజం. మొదటిసారి నాన్న టైటిల్ ని వాడుకుంటున్న నాగార్జున ఇది అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైనర్ అని భరోసా ఇస్తున్నాడు. సెప్టెంబర్ మూడో వారంలో రిలీజ్ ఫిక్స్ చేసిన దేవదాస్ ని వైజయంతి బ్యానర్ మహానటి తర్వాతచేస్తున్న మూవీ కావడంతో ఆ రకంగా కూడా అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ మోడరన్ దేవదాస్ ఎంతవరకు మెప్పిస్తారో వేచి చూడాలి.