Begin typing your search above and press return to search.

ఈ హీరోలు ఆ దర్శకులకి హిట్ ఇస్తాడా?

By:  Tupaki Desk   |   13 Jun 2016 5:30 PM GMT
ఈ హీరోలు ఆ దర్శకులకి హిట్ ఇస్తాడా?
X
దర్శకులు హీరోలకు హిట్లివ్వడం షరా మామోలె. అయితే రివర్స్ లో హీరోనే దర్శకుడికి హిట్ ఇవ్వడం కాస్త అరుదుగా జరిగే అంశం. ఫుల్ స్వింగ్ లో హిట్ల మధ్య వుండే హీరోలు ఫ్లాప్ బాట పట్టి కాస్త గ్యాప్ తీసుకున్న దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం అరుదుగా అనిపించే అంశం.

ఈ వారాంతరం విడుదలకానున్న నాని జెంటిల్ మెన్ సినిమాకి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నాని తన గాడ్ ఫాథర్ కి అవకాశమిచ్చాడనే చెప్పాలి. ఎందుకంటే ఆ దర్శకుడు సినిమా తీసి చాలా కాలమయింది. ఆయన చివరి చిత్రం కూడా ఏమంత హిట్ కాదు. కానీ అతని టాలెంట్ మీదున్న నమ్మకంతో నాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇలాంటి మరో ప్రాజెక్ట్ యువ హీరో రామ్ సంతోష్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న సినిమా. రభస వంటి డిజాస్టర్ తరువాత శ్రీనివాస్ కి మరో హీరో అవకాశమివ్వలేదు. ఈ క్రమంలో తనకి కందిరీగ వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన దర్శకుడికి అవకాశం ఇవ్వడం మెచ్చుకదగినదే. ఈ సినిమాని ఏకబిగిన షూటింగ్ జరిపి దసరాకి విడుదలచేసే ప్రయత్నంలో వున్నారు. .