Begin typing your search above and press return to search.
త్రిషకు నాని ఎస్ అంటాడా?
By: Tupaki Desk | 8 Oct 2018 6:33 AM GMTకోలీవుడ్ లో అక్టోబర్ 4న విడుదలై సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న 96 అక్కడ హౌస్ ఫుల్ కలెక్షన్ తో దుమ్ము దులిపేస్తోంది. పరిస్థితి ఎలా ఉందంటే దీని దెబ్బకు అంతకు ముందు వారం వచ్చిన మణిరత్నం చెక్క చివత వానం(నవాబ్)బాగా స్లో అయిపోయింది. విజయ్ సేతుపతి త్రిషల కెమిస్ట్రీకి సర్వత్రా అభినందనలు దక్కుతున్నాయి. క్రిటిక్స్ ఓ రేంజ్ లో దీన్ని పొగిడేశారు. కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లు తెస్తుండటంతో మిగిలిన భాషలకు రీమేక్ రైట్స్ కోసం డిమాండ్ ఏర్పడింది. దీన్ని ముందే పసిగట్టిన దిల్ రాజు విడుదలకు ముందే హక్కులను కొనేసి తనకు బాగా సన్నిహితంగా ఉండే నాని అల్లు అర్జున్ లకు స్పెషల్ షో వేసి చూపించాడు కూడా.
ఇప్పుడు దీని రీమేక్ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయని టాక్. ఒరిజినల్ లో తన నటనతో కట్టిపడేసిన త్రిషనే ఇందులో నటించమని దిల్ రాజు కోరినట్టు సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ పెట్టా షూటింగ్ లో ఉన్న త్రిష దీనికి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. కాకపోతే ఇందులో హీరో ఎవరో ముందే చెప్పమని కోరిందట. ఇక్కడే ఉంది అసలు చిక్కు. ఇది నానికి విపరీతంగా నచ్చినా ఎంతవరకు చేస్తాడు అనేది అనుమానమే. పైగా జెర్సీ షూటింగ్ కోసం కఠినమైన క్రికెట్ ప్రాక్టీస్ లో ఉన్న నాని వేరే సినిమాల మీద ఫోకస్ పెట్టను అంటున్నాడు. సహ నిర్మాతగా ఉండే ఆసక్తి తప్ప హీరోగా నటించాలని లేదని నాని అన్నట్టు వినికిడి. దీనికి మరో కారణం కూడా కనిపిస్తోంది.
96లో హీరోది మధ్య వయసు పాత్ర. యూత్ ఫుల్ గా ఉండదు. ఎమోషనల్ గా టచ్ చేసేలా ఉన్నా వయసు రిత్యా ఇలాంటి పాత్రలో నానిని చూడటం కష్టమే. ఒకవేళ ఆప్షన్ మార్చాలి అంటే కూడా దిల్ రాజు వేట తీవ్రంగా చేయాల్సి ఉంటుంది. ఓ మీడియాలో శర్వానంద్ లేదా సాయి ధరమ్ తేజ్ తో చేసే అవకాశం గురించి ప్రచారం జరిగింది కానీ ఇది వాళ్లకూ సూట్ అయ్యేది కాదు. మరి ఒకవేళ త్రిష ఓకే చెప్పినా 96లో తనకు జోడి కోసం దిల్ రాజు చాలా కష్టపడాల్సి వచ్చేలా ఉంది. ప్రస్తుతం హలో గురు ప్రేమ కోసమే పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న దిల్ రాజు అది విడుదల అయ్యాకే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది