Begin typing your search above and press return to search.
చిరు పిలుపందుకుని నాని-విశ్వక్ ఏం చేశారంటే!
By: Tupaki Desk | 26 April 2020 6:43 AM GMTతలసేమియా ఒక జన్యు సంబంధమైన వ్యాధి. ఎముక మూలుగలో హిమోగ్లోబిన్ ఉండే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి నిలిచిపోవడాన్ని తలసేమియా వ్యాధి అంటారు. బిడ్డకు జన్మనిచ్చే వారి వల్లే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. దీనిద్వారా జన్యువాహకులైన తల్లిదండ్రులకు (తలసేమియా మైనర్) జన్మించే బిడ్డల్లో పాతిక శాతం మంది పుట్టకతోనే వ్యాధిగ్రస్తులయ్యే (తలసేమియా మేజర్) అవకాశం ఉంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లెక్కల ప్రకారం ప్రపంచంలో 4.5శాతం మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతుండగా.. భారతదేశంలో 3 కోట్ల 50 లక్షలకు పైగా తలసేమియా బారిన పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఇలాంటి ప్రమాదకర వ్యాధితో పాటు క్యాన్సర్ రోగులు.. రక్తస్రావం సమస్య ఉన్న మహిళలు.. యాక్సిడెంట్ల బాధితులు లాక్ డౌన్ వేళ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రక్తదాతలు లేక విలవిలలాడుతున్నారు. సరైన సమయంలో రక్తం అందక ఇప్పటికే పలు మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే యువతరం వాట్సాప్ గ్రూపుల్లో రక్తం అవసరమైన బాధితుల మొర చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. ప్రాక్టికల్ లైఫ్ ఎంత దుర్భరంగా ఉంటుందో వాట్సాప్ గ్రూపుల్లో రక్తం అవసరమైన వారి అభ్యర్థనలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితిపై ఆవేదన చెందిన మెగాస్టార్ చిరంజీవి ప్రజలు తమకు సమీపంలో ఉన్న బ్లడ్ బ్యాంకులకు వెళ్లి రక్తాన్ని దానమివ్వాల్సిందిగా ఇటీవల కోరారు. ఆ మేరకు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి .. హీరో శ్రీకాంత్ సహా మెగా కాంపౌండ్ హీరోలు ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తాన్ని దానమిచ్చారు. మెగా స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ ఇప్పటికే రక్తదానానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. అన్ని మెగా వాట్సాప్ గ్రూపుల్లో దీనికి విశేష స్పందన లభించింది.
తాజాగా యువ హీరోలు నాని.. విశ్వక్ సేన్ తమకు సమీపంలో ఉన్న బ్లడ్ బ్యాంకులకు వెళ్లి రక్తదానం ఇవ్వడం అభిమానుల్లో స్ఫూర్తి నింపింది. నేచురల్ స్టార్ నాని.. ఆయన భార్య అంజన ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తాన్ని దానమిచ్చారు. అలాగే ఫలక్ నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్ చిరంజీవి బ్లడ్ బ్యాక్ కి వచ్చి రక్తాన్ని దానమిచ్చారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరినీ స్ఫూర్తిగా తీసుకుని అభిమానులు మరింత మంది రక్తదానినికి ముందుకొచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తమైంది. నాని అభిమానులు.. విశ్వక్ అభిమానులు పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంకులకు వెళ్లి రక్తాన్ని దానమిస్తే ఆ మేరకు ప్రమాదకర పరిస్థితిని తగ్గించే వీలుంటుందని భావిస్తున్నారు. మెగాస్టార్ పిలుపును అందుకుని ఇలా హీరోలంతా వచ్చి రక్తదానం చేస్తూ దానిని ఫ్యాన్స్ స్ఫూర్తిగా తీసుకునే వీలుంటుంది.