Begin typing your search above and press return to search.

నాని పర్సనల్ ఖాతాలోకి 15 కోట్లు

By:  Tupaki Desk   |   6 April 2017 6:34 AM GMT
నాని పర్సనల్ ఖాతాలోకి 15 కోట్లు
X
హీరో నాని ఇప్పుడు టాప్ ఫామ్ లో ఉన్న హీరో. నాని నటించిన ఓ మోస్తరు సినిమాకు అయినా సరే కలెక్షన్స్ వచ్చిపడిపోతున్నాయి. హంగు ఆర్భాటం పెద్దగా పెట్టుకోకుండా.. సింపుల్ గా సినిమాలు కానిచ్చేస్తూ.. అటు నిర్మాతలకు భారీగా లాభాలు పంచిపెడుతున్నాడు.. ఇటు ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు. మరోవైపు తన క్రేజ్ తో పాటు పర్సనల్ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నాడు.

నాని వరుసగా సినిమాలు చేసేయడానికి కారణం.. ఏడాదికి 10 కోట్లు సంపాదించాలనే టార్గెట్ అంటారు సన్నిహితులు. గతంలో 3 కోట్ల రూపాయలు అందుకున్న నాని.. అందుకు తగ్గట్లుగానే 3-4 సినిమాలు ప్లాన్ చేసుకుని.. చకచకా షూటింగ్ ఫినిష్ చేసేసేవాడు. నేచురల్ స్టార్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ నేను..లోకల్ తర్వాత నాని రేటు పెంచేశాడు. ఒక్కో సినిమాకు 4.5 కోట్ల నుంచి 5 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న 'నిన్ను కోరి'.. నేను లోకల్ రిలీజ్ కి ముందే ఫైనల్ అయిన మూవీ కావడంతో.. దానికి 3 కోట్లే ముట్టాయని అంటున్నారు.

కానీ దీని తర్వాత వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. దీనితోపాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమాకి ఒప్పుకున్నాడు. బాహుబలి నిర్మాతలు వచ్చే ఏడాది ప్రారంభంలో నానితో ఓ మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీటితో పాటు శ్రీనివాస్ అవసరాలతో కూడా నాని ఓ సినిమా చేయాల్సి ఉంది. వీటన్నిటి రెమ్యూనరేషన్.. ఎట్ లీస్ట్ అడ్వాన్సులు లెక్కపెట్టుకున్నా.. ఈ ఏడాది నాని ఈ ఏడాది అందుకునే మొత్తం కనీసం 15 కోట్లు దాటడం ఖాయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/