Begin typing your search above and press return to search.
వెబ్ సిరీస్ లు చేస్తారా అంటే నాని సమాధానం..!
By: Tupaki Desk | 5 Sep 2021 1:30 AM GMTనాని హీరోగా రూపొందిన టక్ జగదీష్ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల విషయంలో కాస్త గందరగోళం అయ్యింది. థియేటర్ రిలీజ్ కోసం చాలా నెలలు వెయిట్ చేసిన మేకర్స్ ఇంకా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో చేసేది లేక ఓటీటీ రిలీజ్ కు సిద్దం అయ్యారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్రైమ్ వీడియో వారు భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. వచ్చే వారంలో స్ట్రీమింగ్ కు సిద్దం అవుతున్న ఈ సినిమా కోసం నాని ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశాడు. ఈమద్య కాలంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా విడుదల విషయంలో ఏర్పడిన గందరగోళం పై నాని స్పందించి నన్ను బయటి వాడిని చేసినట్లుగా మాట్లాడారు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.
ఆ విషయం పై నాని ఇంకా ఎక్కువగా మాట్లాడేందుకు ఆసక్తి కూడా చూపించలేదు. అయితే ముందు ముందు తన సినిమాలు అన్ని కూడా థియేటర్ల ద్వారా మాత్రమే వస్తాయని.. ఒక వేళ ఓటీటీ లో వస్తే కనుక తనను తాను బహిష్కరించుకుంటాను అంటూ అభిమానులకు చాలా నమ్మకం కలిగేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ విషయం పక్కన పెడితే తాజా ఇంటర్వ్యూలో నానిని మీరు వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఈమద్య కాలంలో బాలీవుడ్ నుండి అన్ని భాషల స్టార్స్ కూడా పెద్ద పెద్ద వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. కనుక వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించగా తనను తాను కేవలం థియేటర్లలో మాత్రమే చూడాలనుకుంటున్నాను. నేను వెబ్ సిరీస్ కు ఓటీటీ కి ఫిట్ అవుతాను అని భావించడం లేదు అంటూ నాని క్లారిటీ ఇచ్చాడు.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కాని రాబోయే నాలుగు అయిదు ఏళ్ల వరకు నాని ఓటీటీ కంటెంట్ లో నటించడం మాత్రం దాదాపు అసాధ్యం. తనకు థియేటర్ అంటేనే ఇష్టం అంటూ మరోసారి నాని చెప్పే ప్రయత్నం చేశాడు. ఓటీటీ కంటెంట్ విషయంలో ఆసక్తి లేను అంటూ నాని చెప్పడంతో ఆయన నుండి వెబ్ సిరీస్ లు ఆశించలేం. టక్ జగదీష్ సినిమా తర్వాత నాని చేసిన సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఆ సినిమా ను ఖచ్చితంగా థియేటర్ రిలీజ్ కు సిద్దం చేస్తున్నట్లుగా ప్రకటించారు. థియేటర్ లో కాకుండా ఆ సినిమా కూడా ఓటీటీ అంటూ వార్తలు వచ్చాయి. కాని నాని ఒకటికి రెండు సార్లు ఆ విషయాన్ని ఖండించాడు. ఖచ్చితంగా ఓటీటీ లో మాత్రం రాదని.. పరిస్థితులు అనుకూలించిన తర్వాత సినిమాను థియేటర్ రిలీజ్ కు సిద్దం చేస్తామంటూ అభిమానులకు హామీ ఇచ్చాడు.