Begin typing your search above and press return to search.

అంటే.. ఫ్లాప్ అయినట్లే!

By:  Tupaki Desk   |   19 Jun 2022 3:30 AM GMT
అంటే.. ఫ్లాప్ అయినట్లే!
X
నేచురల్ స్టార్ నాని నటించిన 'అంటే సుందరానికి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎనిమిది రోజులు పూర్తయ్యింది. అయితే ఇంకా ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని ఏమాత్రం వెనక్కి తీసుకురాలేకపోయింది.

ఒక విధంగా నాని స్టార్ హీరోగా క్రేజ్ అందుకున్న తరువాత అతి తక్కువ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. సినిమా ఈ రేంజ్ లో అతి తక్కువ ఓపెనింగ్స్ అందుకుంటుందని ఎవరు ఊహించలేదు.

శుక్రవారం అయితే మరీ తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. శనివారం ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఏమి లేవు. ఇక విరాటపర్వం, గాడ్సే సినిమాలు పెద్ద పోటీ కాదనే చెప్పాలి. ఆ సినిమాలకే కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక నాని సినిమాని జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగులో నజ్రియా మొదటి సినిమా అయినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు.

నాని నుంచి కామెడీ సినిమా రావాలి అనుకున్న ఆడియెన్స్ కూడా సినిమా థియేటర్ కు రెండవ సారి రావడం లేదని అనిపిస్తోంది. ఇక రివ్యూలు పాజిటివ్ గానే ఉన్నప్పటికీ ఎందుకు ఈ సినిమా కలెక్షన్స్ తగ్గుతూ ఉన్నాయో నిర్మాతలకు అర్థం కాలేదు. అయితే ఈ సినిమాకు మైనస్ ఏమైనా ఉందా అంటే అది మ్యూజిక్ అనే చెప్పాలి. అసలు పాటల వలన కూడా ఏ మాత్రం అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు.

ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా థియేట్రికల్ గా సక్సెస్ కావాలి అంటే మరో 10కోట్లు రాబట్టాలి. కానీ శుక్రవారం 11 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా శని ఆదివారం కలిపిన 50లక్షలు అందుకోవడం కష్టమే. దీనికంటే ఓ వర్గం ఆడియెన్స్ మేజర్ సినిమాపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడం విశేషం.

ఇక ఫైనల్ గా అంటే సుందరానికి సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు పది కోట్ల వరకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. యూఎస్ లో ఈ సినిమా ఇప్పటికే వన్ మిలియన్ డాలర్స్ అందుకుంది అక్కడ సక్సెస్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దారుణంగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది.