Begin typing your search above and press return to search.

అంటే సుందరానికి కాస్త ఎక్కువ సమయమే..!

By:  Tupaki Desk   |   5 Jun 2022 6:08 AM GMT
అంటే సుందరానికి కాస్త ఎక్కువ సమయమే..!
X
నాని హీరోగా నజ్రీయా హీరోయిన్‌ గా రూపొందిన అంటే సుందరానికి సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. నాని లుక్ మరియు పాత్ర చాలా వినోదాత్మకంగా ఉండటంతో పాటు కథ కూడా చాలా ఎంటర్‌ టైన్మెంట్‌ తో కూడినది ఉంటుందని ట్రైలర్ మరియు టీజర్ చూస్తే అర్థం అయ్యింది.

ఈనెల 10వ తారీకున విడుదల కాబోతున్న అంటే సుందరానికి సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. క్లీన్ యూ సర్టిఫికెట్‌ ను సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఇచ్చింది. ఈమద్య కాలంలో క్లీన్ యూ సినిమాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కమర్షియల్‌ సినిమాలు అంటే కాస్త రొమాన్స్.. యాక్షన్‌ మిలితం అయ్యి ఉంటాయి. కాని అంటే సుందరానికి మాత్రం క్లీన్ యూ రావడంతో ఎలా ఉండబోతుందా అంటూ అంతా ఆసక్తి వ్యక్తం అవుతోంది.

ఇక ఈ సినిమా సెన్సార్‌ కాపీలో 2 గంటల 56 నిమిషాల రన్ టైమ్ అంటూ సూచించడం జరిగింది. దాదాపుగా మూడు గంటల సినిమా గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈమద్య కాలంలో మూడు గంటల సినిమాలు కొన్ని మాత్రమే వచ్చాయి. భారీ బడ్జెట్‌ సినిమాలు.. రాజమౌళి వంటి స్టార్‌ డైరెక్టర్ చేసిన సినిమాలు మాత్రం మూడు గంటల నిడివి తో వచ్చే సాహసం చేశాయి.

చిన్న సినిమాలు.. మీడియం రేంజ్ సినిమాలు రెండున్నర గంటల నిడివి ఉంటే చాలు అన్నట్లుగా సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు భావిస్తున్నారు. మూడు గంటలు అంటే చాలా లాగ్స్ ఉంటాయి. దాంతో సాధ్యం అయినంత తక్కువ నిడివి సినిమాలనే జనాలు ఇష్టపడుతున్నారు. అందుకే చాలా సినిమాలు రెండున్నర గంటలకు అటు ఇటుగా తీసుకు వస్తున్నారు.

నమ్మకమో లేదా అతి నమ్మకమో కాని అంటే సుందరానికి సినిమా ఏకంగా మూడు గంటల రన్ టైమ్‌ తో రాబోతుందని క్లారిటీ వచ్చింది. సినిమా కు పాజిటివ్‌ టాక్‌ వచ్చి ఎంటర్‌ టైన్మెంట్‌ బాగా ఉందంటే పర్వాలేదు కాని కాస్త అటు ఇటు అయితే ఖచ్చితంగా సుందరానికి కష్టాలు తప్పవేమో అంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చిత్ర యూనిట్‌ సభ్యులు ముఖ్యంగా హీరో నాని మరియు దర్శకుడు చాలా నమ్మకంగా ఉండటం వల్ల మూడు గంటల నిడివి తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. విజువల్‌ వండర్ సినిమాలను.. ఎంటర్‌ టైన్మెంట్‌ సినిమాలను ఎక్కువ రన్‌ టైమ్‌ ఉన్నా కూడా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారని గతంలో నిరూపితం అయ్యింది. ఆ నమ్మకంతోనే అంటే సుందరానికి ఎక్కువ సమయం ప్రేక్షకుల నుండి తీసుకోబోతున్నారట.