Begin typing your search above and press return to search.

అంటే సుందరానికి ఫైనల్ గా ఇదీ పరిస్థితి

By:  Tupaki Desk   |   7 July 2022 1:31 PM GMT
అంటే సుందరానికి ఫైనల్ గా ఇదీ పరిస్థితి
X
నాని హీరోగా నజ్రియా హీరోయిన్‌ గా రూపొందిన అంటే సుందరానికి సినిమా భారీ అంచనాల నడుమ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నిర్మించారు. సినిమా కు వచ్చిన పాజిటివ్‌ బజ్ నేపథ్యంలో 30 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్ ను చేసిన విషయం తెల్సిందే. మైత్రి వారికి విడుదలకు ముందే లాభాలు వచ్చాయి అన్నట్లుగా ప్రచారం జరిగింది.

సినిమా విడుదల తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాని పరిస్థితులు సినిమాకు అనుకూలించలేదు. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా వసూళ్ల విషయం లో నిరాశ తప్పలేదు. మంచి ఎంటర్‌ టైనర్‌ అంటూ రివ్యూలు వచ్చినా.. నాని నవ్వించాడు అంటూ వార్తలు వచ్చినా మొత్తానికి అంటే సుందరానికి ఫైనల్‌ గా మాత్రం నిరాశ పర్చిందని చెప్పక తప్పదు.

అంటే సుందరానికి సినిమా తెలుగు రాష్ట్రాల్లో లాంగ్‌ రన్‌ లో రూ. 14 కోట్లకు కాస్త అటు ఇటుగా షేర్ ను రాబట్టింది. ఇది చాలా నిరాశ ను కలిగించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అంటే సుందరానికి సినిమా రూ.22 కోట్ల వరకు రాబట్టిందనే వార్తలు వస్తున్నాయి. అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు దూరంగానే ఉండి పోయినట్లుగా యూనిట్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

వివేక్ ఆత్రేయ విభిన్న చిత్రాల దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. అందుకే ఆయన దర్శకత్వంలో అంటే సుందరానికి సినిమా అనగానే అందరిలో కూడా ఆసక్తి కనిపించింది. సినిమా విడుదల తర్వాత కూడా పాజిటివ్‌ టాక్ దక్కించుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సందడి మాత్రం కనిపించలేదు. నాని గత చిత్రం శ్యామ్‌ సింగ రాయ్ తో పోల్చితే అంటే సుందరానికి ప్లాప్ వెంచర్ గా తేల్చేస్తున్నారు.

ఈ సినిమా విడుదల అయిన సమయంలో భారీ సినిమాలు పెద్ద సినిమాలు ఏమీ లేవు. అయినా కూడా వసూళ్ల విషయం లో నిరాశ ఎందుకు వచ్చిందంటూ చర్చ మొదలు అయ్యింది. నాని పై కుట్ర పన్ని కొందరు సినిమా కు వసూళ్లు రాకుండా చేస్తున్నారనే పుకార్లు కూడా షికార్లు చేశాయి. మొత్తానికి అంటే సుందరానికి సినిమా ఫైనల్‌ గా కమర్షియల్‌ ప్లాప్ గా తేలిపోయింది.