Begin typing your search above and press return to search.

ఈ సారి ఆర్మీ ఆఫీసర్ గా...

By:  Tupaki Desk   |   14 Aug 2017 12:11 PM GMT
ఈ సారి ఆర్మీ ఆఫీసర్ గా...
X
ప్రస్తుత రోజుల్లో ఓ హీరో వరుసగా మూడు హిట్లు అందుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవాలంటే సాధారణమైన విషయం కాదు కానీ హీరో నాని మాత్రం సింపుల్ గా తన కామెడీ - లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల మనస్సును దోచుకుంటున్నాడు. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న హీరోలకు సాధ్యం కానీ బాక్స్ ఆఫీస్ రికార్డును సైతం అవలీలగా కొట్టేస్తున్నాడు ఈ యువ హీరో. అది కూడ ఒక్క హిట్ కాదు డబుల్ హ్యాట్రిక్ లతో దూసుకుపోతున్నాడు.

నేను లోకల్- నిన్ను కోరి వంటి సినిమాలతో హిట్స్ అందుకొని ఇప్పటివరకు ఒకే ఫార్మాట్ లో వచ్చిన నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు స్టైల్ ని మార్చబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా హను రాఘవపూడి కథను ఒకే చేశాడట. అందులో నాని ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు దర్శకుడు హను రాఘవపూడి ఓ ఆన్ లైన్ మీడియాకు చెప్పాడని సమాచారం. వీరిద్దరి కలయికలో ఇంతకుముందు "కృష్ణ గాడి వీర ప్రేమగధ" సినిమా వచ్చింది ఆ చిత్రం ఇద్దరికి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇప్పుడు మళ్లీ మరో కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు సమాచారం.

అయితే ఇంకా ఈ సినిమాకు సంబందించిన యూనిట్ ని గాని దర్శకుడు ఫైనల్ చేయలేదట. ప్రస్తుతం నాని దిల్ రాజు ప్రొడక్షన్ లో "ఎంసీఏ" అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ - ఎక్స్ ప్రెస్ రాజా వంటి హిట్స్ అందుకున్నదర్శకుడు మేకపార్ల గాందీతో "కృష్ణార్జున యుద్ధం" అనే సినిమాను కూడా రీసెంట్ గా మొదలు పెట్టాడు. ఇక ఈ చిత్రాలు షూటింగ్ అయిపోయిన తర్వాత హను తో సినిమాను మొదలు పెట్టవచ్చని తెలుస్తోంది.