Begin typing your search above and press return to search.
చేప కథ చెబుతున్న నాని
By: Tupaki Desk | 7 July 2017 3:58 AM GMTహీరో నానికి పేరుతో పాటు సక్సెస్ ను కూడా తెచ్చిపెట్టిన సినిమాలు చాలా ఉంటాయ్ కానీ.. ఈ హీరో కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాల్లో ప్రధానమైనది ఈగ. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో.. నాని కనిపించేది కాసేపే అయినా.. ఉన్న కాసేపు అలరించేస్తాడు. ఆ తర్వాత కూడా ఈగలో నానిని చూసుకుంటారు జనాలు.
ఐదేళ్ల క్రితం వచ్చిన ఈగ చిత్రానికి నాని హీరో మాత్రమే. కానీ ఇప్పుడు ఈ ఈగ పాత్రధారి మరో ప్రయోగం చేస్తున్నాడట. ఇప్పుడు చేప ప్రధాన పాత్రలో ఓ మూవీ తీసేస్తున్నాడట నాని. ఈ చేప సినిమాతో నాని నిర్మాతగా మారుతున్నాడని తెలుస్తోంది. నిర్మాతగా న్యాచురల్ స్టార్ కి ఇది తొలి చిత్రం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైపోయిందని.. కొంత భాగం చిత్రీకరణ పూర్తయ్యాక ఓ చిన్న టీజర్ ను రిలీజ్ చేసి.. అప్పుడు సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ శర్మ అనే కొత్త కుర్రాడు ఈ చేప సినిమాతో దర్శకుడిగా పరిచయం కానుండగా.. ఈ కథ విని నాని తెగ ఇంప్రెస్ అయిపోయాడని తెలుస్తోంది.
అందుకే తనే నిర్మాతగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడట. ఈ చిత్రంలో నాని యాక్టింగ్ చేయడంపై ఇంకా స్పష్టత లేదు. అయితే.. నిర్మాతగా మారేందుకు తను సిద్ధంగానే ఉన్నానని.. కాకపోతే ఆ సినిమాల్లో తను నటించబోనని.. యాక్టింగ్ ప్లస్ ప్రొడక్షన్ రెండు పనులు చూసుకోలేనని రీసెంట్ గా నాని చెప్పడం చూస్తుంటే.. ఈ చేప కథ కరెక్టే అనిపించక మానదు.