Begin typing your search above and press return to search.

నువ్వు సూపరమ్మా నాని!!

By:  Tupaki Desk   |   13 Feb 2016 1:23 PM GMT
నువ్వు సూపరమ్మా నాని!!
X
మామూలుగా సినిమా ప్రమోషన్లలో కాదు.. సినిమా షూటింగులో బిజీగా ఉన్నా కూడా.. చాలామంది హీరోలు అసలు బయట పార్టీలకు గాని.. బయట ఎటువంటి ఈవెంట్లకు గాని అటెండ్‌ కానే కారు. అటువంటిది.. ఒక సినిమా రిలీజ్‌ అయ్యి.. దానికి మాంచి టాక్‌ వచ్చిన సందర్భంగా.. దానిని ప్రమోట్‌ చేస్తే ఇంకా ఎక్కువ రీచ్‌ అవుతుంది. కాని హీరో నాని మాత్రం అలా చేయలేదండోయ్‌.

కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాకు మాంచి టాక్‌ వచ్చిన సందర్భంగా.. నాని ఇప్పుడు టివిల్లో పడి సినిమాను తెగ ప్రమోట్‌ చేసుకుంటే.. నిర్మాతలకు భారీగా శని - ఆదివారాల్లో కలెక్షన్లు ఉంటాయని అందరూ అనుకున్నారు. అయితే మనోడు ఇవన్నీ చేస్తూనే.. ఇంత బిజీ షెడ్యూల్‌ లో తన అసిస్టెంట్‌ శ్రీను రిసెప్షన్‌ కు వెళ్ళాడు నాని. వరంగల్‌ లో నిన్న పెళ్లి చేసుకున్న శ్రీను ఈరోజు రిసెప్షన్‌ హోస్ట్‌ చేశాడు. ఆ కార్యక్రమానికి సతీసమేతంగా విచ్చేశాడు నాని. ఇంత హడావుడిలో మావోడు పెళ్ళి చేసుకున్నాడు అంటూ చెబుతూనే.. వరంగల్‌ వెళ్ళొచ్చాడు నాని. సూపర్‌ కదూ.