Begin typing your search above and press return to search.
నాని చేతికి ప్రముఖ దుస్తుల బ్రాండ్..!
By: Tupaki Desk | 5 April 2022 1:48 PM GMTనేచురల్ స్టార్ నాని విభిన్నమైన కథలు మరియు విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో మెమరబుల్ విజయాలు అందుకుంటున్నాడు. ఇటీవల 'శ్యామ్ సింఘ రాయ్' సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరినీ మెప్పించి, భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
సినిమా సినిమాకూ విపరీతంగా పాపులారిటీ పెంచుకుంటూ వెళ్తున్న నాని.. ఇప్పుడు పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నాడు. అలానే అతని క్రేజ్ ని క్యాష్ చేసుకొని తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్లు సైతం నాని వైపు చూస్తున్నాయి.
లేటెస్టుగా దక్షిణ భారతదేశంలోని నెం.1 దుస్తుల బ్రాండ్ గా పేరుగాంచిన ఒట్టో యొక్క నాణ్యమైన ఉత్పత్తి 'మినిస్టర్ వైట్' కు నాని ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించిన నాని.. ఈ బ్రాండ్ యొక్క వాణిజ్య ప్రకటనను కూడా ఆవిష్కరించారు.
'నేచురాలిటీకి ఐడెంటిటీ మన నాని.. అలాగే ఇక నుంచి ట్రెడిషనల్ ఐడెంటిటీకి మినిస్టర్ వైట్' అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ప్రముఖ యాడ్ డైరెక్టర్లు శంకర్ - గుణ ఈ వాణిజ్య ప్రకటనకు దర్శకత్వం వహించారు. ఈ యాడ్ లో నాని రకరకాల సంప్రదాయ దుస్తుల్లో సరికొత్తగా కనిపిస్తున్నారు. పొడవాటి జుట్టుతో గుబురు గడ్డం మరియు మీసాలతో 'దసరా' గెటప్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.
అంతేకాదు చివర్లో 'పంచెను మడతెత్తి మాస్ గా నిలబడితే.. ఆ లుక్.. అందులో ఓ కిక్..' అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి అలరించాడు నాని. 'మినిస్టర్ వైట్' అనేది ఒట్టో నుండి చొక్కాలు మరియు దోతీస్ బ్రాండ్ పేరు. ఇప్పుడు ఇందులో హీరో నాని భాగం కావడంతో.. ఇది బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుతుందని వారు భావిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే సుందరానికీ' అనే సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇదే క్రమంలో నాని 'దసరా' అనే యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇది నాని కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటుగా హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.