Begin typing your search above and press return to search.
'నా 50కి మీరే డైరెక్టర్' అంటున్న నేచురల్ స్టార్
By: Tupaki Desk | 17 April 2020 3:22 PM GMTటాలీవుడ్ లో నేచురల్ స్టార్ నానిని హీరోగా నిలబెట్టిన దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరుగా కనిపిస్తాడు. ఆయన తెరకెక్కించిన 'అష్టాచెమ్మా' .. 'జెంటిల్ మేన్' నాని కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడో సినిమాగా 'వి' రూపొందింది. ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమా - లాక్ డౌన్ కారణంగా థియేటర్లకు రాలేకపోయింది. ఈ రోజున ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా నాని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు.
వి సినిమాలో మొదటిసారి నాని విలన్ గా నటించాడు. ఈ సినిమాలో నానిని చాలా విభిన్నంగా చూపించబోతున్నాడట డైరెక్టర్ ఇంద్రగంటి. నానికి ఇది 25వ సినిమా కావడం విశేషం. ఈ సందర్బంగా నాని.. సోషల్ మీడియా ద్వారా డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయనను ఉద్దేశించి.. 'నా మొదటి సినిమాను - ఇంకా నా 25వ సినిమా మీరే డైరెక్ట్ చేశారు. రాబోయే నా 50వ సినిమా కూడా మీరే డైరెక్ట్ చేస్తారు. అలాగే మీ 25వ సినిమాలో హీరో నేనే' అంటూ కామెంట్స్ పోస్ట్ చేసాడు.
ప్రస్తుతం నాని కామెంట్స్ సినీ వర్గాలలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న హీరోలు 50వ నెంబర్ వరకు చేరాలంటే చాలా కష్టం. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేయడమే కష్టం. అంటే ఆ లెక్కన నాని 50 సినిమాకు చేరాలంటే కనీసం 10 ఏళ్లు అయినా పడుతుంది. అప్పటి వరకు ఈయన కెరీర్ ఎలా ఉంటుందో ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాని మాత్రం చాలా నమ్మకంగా సినిమా చేస్తానంటూ ప్రకటించడాన్ని కొందరు అభినందిస్తున్నారు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటిపై నాని అభిమానాన్ని చాటుకున్నాడని మాట్లాడుకుంటున్నారు.