Begin typing your search above and press return to search.

జక్కన్న, మహేష్ లకు నాని సవాల్

By:  Tupaki Desk   |   21 Nov 2015 7:33 AM GMT
జక్కన్న, మహేష్ లకు నాని సవాల్
X
బాహుబలితో రాజమౌళి సృష్టించిన సంచలనాలు మనకు తెలుసు. శ్రీమంతుడుతో మహేష్ సృష్టించిన ప్రభంజనమూ తెలుసు. మరి ఇలాంటి భారీ చిత్రాలతో చిన్న సినిమాలు పోటీ పడగలవా? అసలు రిలీజ్ కే ముందుకు రానపుడు పోటీ ఏముంటుంది అనుకోవచ్చు కానీ.. కాంపిటీషన్ అయితే తప్పడం లేదు. కాకపోతే కలెక్షన్స్ విషయంలో కాదు. అవార్డుల విషయంలో సవాల్ ఎదురవుతోంది.

ప్రతిష్టాత్మక ఐఐఎఫ్ ఏ అవార్డులకు నామినేట్ అయిన మూవీస్ లో.. టాలీవుడ్ టాప్ మూవీస్ అయిన బాహుబలి - శ్రీమంతుడు సహజంగానే ప్లేస్ దక్కించుకున్నాయి. కానీ వీటికి సవాల్ విసురుతున్న సినిమాలు చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఆ మూడింటిలో ఒకటి పాఠశాల అయితే.. మిగిలినవి భలేభలే మగాడివోయ్ - ఎవడే సుబ్రమణ్యం చిత్రాలు ఉన్నాయి. మొత్తం ఐదు మూవీస్ బెస్ట్ పిక్చర్ రేసులో ఉంటే.. ఇందులో రెండు నాని నటించినవే కావడం విశేషం. బాహుబలి - శ్రీమంతుడు చిత్రాలకు ఎంతగా అవకాశం ఉందో.. ఎవడో సుబ్రమణ్యం లాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీకి, భలేభలే మగాడివోయ్ లాంటి ఫన్ ఎంటర్ టెయినర్ లకు అంతే స్కోప్ ఉంటుంది.

దీనికి తోడు ఇవి ప్రేక్షకుల ఓటింగ్ పై ఆధారపడ్డ అవార్డులు కావడంతో... పోటీ మరింత రసవత్తరంగా ఉండడం ఖాయం. మొత్తానికి చిన్న సినిమాతో సెన్సేషన్ సృష్టించిన నాని.. ఇప్పుడు అవార్డు కోసం భారీ చిత్రాలు - టాప్ స్టార్లతోనే ఢీ కొట్టబోతున్నాడు. కాకపోతే.. ఈ ఏడాదికి మెజారిటీ అవార్డులను బాహుబలి సొంతం చేసుకుంటుందనే అంచనాలు ఉన్నా.. అన్నీ ఒకే చిత్రానికి రావడం జరగదు. అందులోనూ ఇది ఫుల్ ప్లెడ్జెడ్ స్టోరీ - స్క్రీన్ ప్లే కాదు కాబట్టి... చాలా కేటగిరీస్ ఓపెన్ గానే ఉంటాయన్నది సుస్పష్టం.