Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డికి నాని క్లాస్
By: Tupaki Desk | 17 Jun 2018 7:22 AM GMTకొంత కాలంగా నేచురల్ స్టార్ నాని మీద శ్రీరెడ్డి అదే పనిగా ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ఓపిక పట్టిన నాని.. ఇటీవలే ఆమెకు లీగల్ నోటీస్ పంపించాడు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి పేరెత్తకుండానే ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంలో శ్రీరెడ్డి చేసే ఆరోపణలపై డిస్కషన్లు పెడుతూ.. వార్తలు ప్రచురిస్తున్న మీడియాను కూడా అతను టార్గెట్ చేశాడు. ఐతే ఆ ప్రకటన చివర్లో ఇకపై తాను ఈ అంశంపై మాట్లాడనని అన్నాడు నాని. కానీ నాని ఈ అంశంపై ఇప్పుడు పరోక్షంగా స్పందించాడు. శ్రీరెడ్డికి క్లాస్ పీకేశాడు. అలాగని నాని ఏమీ శ్రీరెడ్డిని కలవలేదు. ఎక్కడా ఆమె పేరు కూడా ఎత్తలేదు. కానీ ఆమెకు ఏం చెప్పాలనుంటున్నాడో అది మాత్రం చెప్పేశాడు. ఇందుకు ‘బిగ్ బాస్’ షోనే వేదికగా చేసుకున్నాడు నేచురల్ స్టార్.
ఈ రోజుల్లో ఇంటర్నెట్లో చాలా నెగెటివిటీ బాగా పెరిగిపోయిందని.. ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టడం మామూలైపోయిందని నాని అన్నాడు. ఐతే దీప్తి సునైన అనే 20 ఏళ్ల అమ్మాయి చిన్న వయసులోనే తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిందని.. ఇందుకు కారణం ఇంటర్నెట్టే అని.. దేన్నయినా మనం ఎలా ఉపయోగించుకుంటామన్నదే కీలకమని నాని చెప్పాడు. 20 ఏళ్ల వయసులో తాను ఏమీ లేని వాడిగా ఫిలిం నగర్ రోడ్లపై తిరిగానని.. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఈ స్థితిలో ఉన్నానని నాని అన్నాడు. కాబట్టి జనాల దృష్టిని ఆకర్షించడానికి.. పాపులారిటీ పెంచుకోవడానికి నెగెటివ్ రూట్ ఎంచుకోవడం కరెక్ట్ కాదని.. అవతలి వాళ్ల ప్రశాంతతను దెబ్బ తీయడం.. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోవడం మానుకోవాలని నాని హితవు పలికాడు. నాని వ్యాఖ్యలు శ్రీరెడ్డి ఉద్దేశించినవే అన్నదానిపై ఎవరికీ సందేహాలు లేవు.