Begin typing your search above and press return to search.
'దారే లేదా' అంటున్న నాని..!
By: Tupaki Desk | 15 Jun 2021 11:40 AM GMTనేచురల్ స్టార్ నాని ఇటీవల ట్వీట్ చేస్తూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం మన హీరోల కోసం.. త్వరలో సంథింగ్ స్పెషల్ తో రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 'సంథింగ్ స్పెషల్' ఎంటనేది నాని చెప్పనప్పటికీ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో అమూల్యమైన సేవలు అందిస్తున్న డాక్టర్స్ - హెల్త్ వర్కర్స్ కోసం మ్యూజిక్ వీడియోతో వస్తున్నాడని అర్థం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా నాని ట్విట్టర్ వేదికగా ఆ స్పెషల్ ఏంటో వెల్లడించారు. ''దారే లేదా'' అనే ఓ ప్రత్యేకమైన వీడియో సాంగ్ ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ''నాకు ఒక ఆలోచన వచ్చింది. అది ఇప్పుడు నిజమైంది. మన హీరోల కోసం ఇదొక ప్రత్యేక పాట'' అని పేర్కొన్నారు.
నాని 'వాల్ పోస్టర్ సినిమా' సమర్పణలో చాయ్ బిస్కెట్ సహకారంతో ''దారే లేదా'' సాంగ్ ను రూపొందించారు. త్వరలోనే లహరి మ్యూజిక్ ద్వారా తెలుగు తమిళ భాషల్లో ఈ పాట రిలీజ్ కానుంది. ఇందులో 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాలో జోడీగా నటించిన టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ - రూప కొడువయూర్ ఇందులో యాక్ట్ చేశారు. నాని నిర్మిస్తున్న 'మీట్ క్యూట్' చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న విజయ్ బుల్గానిన్.. 'దారే లేదా' పాటకు ట్యూన్ కంపోజ్ చేశారు. తమిళ వెర్షన్ కు మదన్ కార్కి సాహిత్యం అందించగా.. తెలుగులో కె.కె(కృష్ణకాంత్) లిరిక్స్ రాశారు. కరోనా పాండమిక్ సమయంలో అవిరామంగా సేవలు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం 'దారే లేదా' మ్యూజిక్ వీడియోతో వస్తున్న నాని కి ప్రశంసలు దక్కుతున్నాయి.