Begin typing your search above and press return to search.
నాని రియల్ లవ్ స్టోరీ.. నాతో పెళ్లికి వాళ్లు ఒప్పుకోలేదు
By: Tupaki Desk | 7 Jun 2022 6:06 AM GMTటాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల జాబితాలో ముందు వరుసలో నాని ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాచురల్ స్టార్ నాని హీరోగా పరిచయం అయ్యి అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో అంటే 2012 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఫేస్ బుక్ ప్రేమ కాస్త పెళ్లి వరకు దారి తీసింది. ఇరు కుటుంబాలను ఒప్పించి.. మెప్పించి అందరి సమక్షంలోనే ప్రేమ వివాహాన్ని నాని చేసుకున్నాడు.
నాని ప్రేమ వివాహం గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకున్నారు. హీరో నాని పెళ్లి రహస్యంగా.. ఎవరికి తెలియకుండా జరిగింది అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుని అప్పట్లో మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. కాని వాటిల్లో ఎక్కువ శాతం పుకార్లే అంటూ నాని తాజా ఇంటర్వ్యూలో తన ప్రేమ కథను.. పెళ్లి వ్యవహారంను గురించి చెబుతూ క్లారిటీ ఇచ్చాడు.
నాని తాజా చిత్రం అంటే సుందరానికి విడుదలకు సిద్దంగా ఉంది. హీరోగా నాని వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. అంటే సుందరానికి కూడా తప్పకుండా ఒక కమర్షియల్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ వారంలో విడుదల కాబోతున్న అంటే సుందరానికి సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ నాని తమ ప్రేమ కథను రివీల్ చేశాడు.
నాని మాట్లాడుతూ... అందరు అనుకుంటున్నట్లుగా మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఏమీ కాదు. మా లవ్ స్టోరీ లో పెద్ద ఇబ్బందులు ఏమీ ఎదుర్కోలేదు. మేము ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యి ప్రేమించుకున్నాం. అంతా బాగానే ఉంది అనుకున్నాం కాని అమ్మాయి తరపు వారికి మాత్రం ఆమెను నాకు ఇచ్చే విషయంలో కాస్త టెన్షన్ అయితే ఉండేది. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్నాను.
హీరోగా ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనే విషయం తెలియదు.. అలాంటి వ్యక్తికి ఎలా ఇవ్వాలి అనే టెన్షన్ అయితే మొదట ఉండేది. వాళ్ల ఫ్యామిలీ సైంటిస్ట్ నేపథ్యం. ఆ కారణంగానే పెళ్లికి మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కాని ఎప్పుడైతే నన్ను కలిశారో.. ఒక సారి మాట్లాడుకున్న తర్వాత నా పై నమ్మకం కలిగి ఆమెను ఇచ్చేందుకు ఒప్పుకున్నారు అన్నాడు. మా పెళ్లి కి ఇరువైపుల పెద్దలు ఒప్పుకున్నారు. మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నాడు.
ఇక నాని అంటే సుందరానికి సినిమా విషయానికి వస్తే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. విడుదలకు ముందే చాలా పాజిటివ్ టాక్ ఈ సినిమాకు వచ్చింది. ట్రైలర్ తో పాటు పోస్టర్స్ ఇంకా సినిమా ప్రమోషన్ లో నాని మరియు హీరోయిన్ నజ్రియా ఫాహద్ చేస్తున్న హడావిడి సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి.