Begin typing your search above and press return to search.

చిందులేయడంలో కూడా నాని స్పెషాలిటీ

By:  Tupaki Desk   |   16 Jan 2017 1:13 PM GMT
చిందులేయడంలో కూడా నాని స్పెషాలిటీ
X
నేచురల్ స్టార్ గా అప్ గ్రేడ్ అయిపోయిన నాని.. నేను లోకల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసేందుకు తెగ స్పీడ్ గా రెడీ అయిపోతున్నాడు. సాధారణంగా యాక్టింగ్ విషయంలోనే తన ప్రత్యేకత చూపించే ఈ హీరో.. నేను లోకల్ లో మరో కొత్త విద్యలో ప్రావీణ్యత ప్రదర్శించనున్నాడట.

అదే.. డ్యాన్సింగ్. ఇప్పటివరకూ నాని ఏ మూవీలోనూ డ్యాన్సులకు ఇంపార్టెన్స్ ఇచ్చినదే లేదు. కానీ నేను లోకల్ విషయంలో మాత్రం డ్యాన్సుల కోసం బాగా కష్టపడ్డాడట. రీసెంట్ గా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ లో నాని వేసిన స్టెప్పులు చూస్తుంటే.. వీటి పై ఎంతగా దృష్టిపెట్టాడో అర్ధమవుతుంది. మొదటిసారిగా నాని మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. పాటలన్నీ తెగ క్యాచీగా ఉండడంతో జనాల నోళ్లలో నానుతున్నాయి. దేవిశ్రీ ఇచ్చిన సూపర్బ్ మ్యూజిక్ కి అదిరిపోయే స్టెప్పులు వేశాడట నాని.

నేను లోకల్ ఆడియో ఈవెంట్ లో కూడా నాని ఈ విషయం చెప్పాడు. తాను ఇప్పటివరకూ డ్యాన్సులపై ఫోకస్ చేయలేదు కానీ.. నేను లోకల్ లో మాత్రం.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించేందుకు డ్యాన్సుల విషయంలో చాలా కష్టపడ్డానని చెప్పాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 3న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/