Begin typing your search above and press return to search.
నాని దసరా ఈవెంట్ అక్కడే..
By: Tupaki Desk | 19 March 2023 10:00 PM GMTనాచురల్ స్టార్ నాని నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ దసరా. ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేను లోకల్ తర్వాత కీర్తి సురేష్ నానితో కలిసి నటిస్తున్న చిత్రమిది. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం సహా హిందీ భాషల్లో ఏకకాలంలో మార్చి 30న రిలీజ్ కానుంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇప్పటికే హీరో నాని.. ఇండియా వ్యాప్తంగా పలు నగరాల్లో పర్యటిస్తూ మూవీని ప్రమోట్ చేస్తున్నాడు. ముంబై, కేరళ, తమిళనాడు, బెంగుళూరు వంటి సౌత్ నగరాలే కాకుండా నార్త్ లోను నాని ప్రచారం మొదలు పెట్టేసిన విషయం తెలిసిందే. అక్కడి వారితో నాని కలిసి సందడి చేస్తున్న వీడియోస్ వైరల్ గా కూడా మారాయి.
అయితే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారని తెలుస్తుంది. ఈనెల 24వ తేదీన లేదా 26వ తేదీన దసరా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. అయితే అది కూడా ఆంధ్ర ప్రదేశ్ లో నిర్వహించనున్నారని తెలుస్తుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాని ఆంధ్రాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం కొంచెం ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఏపీ వారిని ఏ మేరకు ఆకట్టుకుంటుందో.
ఇక సినిమా నుంచి విడుదలైన టీజర్ సాంగ్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చంకీల అంగీలు వేసి పాటకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎక్కడ చూసిన ఇవే పాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నేటివిటీ, సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ప్రత్యేకించి ఈ సినిమాలో నాని మేకోవర్, మాస్ పెర్ఫామెన్స్‌కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ మేరకు దసరా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎస్ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.