Begin typing your search above and press return to search.

నాని రేంజ్ కి ప‌రీక్ష‌.. 'ద‌స‌రా'కి 60 కోట్లు!

By:  Tupaki Desk   |   9 Jun 2022 10:35 AM GMT
నాని రేంజ్ కి ప‌రీక్ష‌.. ద‌స‌రాకి 60 కోట్లు!
X
తెలుగు సినిమా బ‌డ్జెట్ అంత‌కంత‌కు పెరిగిపోతుంది. హీరోల‌పై న‌మ్మ‌కంతో..ఇమేజ్ తో నిర్మాత‌లు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. డ‌బ్బుని మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేస్తున్నారు. కంటెంట్ యూనివ‌ర్శ‌ల్ గా ఉంటే మ‌ధ్య‌లోనే పాన్ ఇండియా అంటున్నారు. ప్లానింగ్ లేకుండా దిగిపోతున్నారు. అప్పుడు సినిమా ఖ‌ర్చు అన్ లిమిటెడ్.

సినిమాకి ఖ‌ర్చు చేయ‌డం అన్న‌ది ఇప్పుడు ప్రెస్టీజీయ‌స్ గా మారిపోయింది. బ‌డ్జెట్ ని బ‌ట్టి బిజినెస్ చేసే రోజుల్లోకి వ‌చ్చేసాం. దాన్ని ఆధారంగా చేసుకునే ప్రేక్ష‌కుడి నెత్తిన ప‌ది రోజుల పాటు హైక్ టెక్కిట్ ధ‌రతో ఎలా బాదేస్తున్నారో? కూడా చూస్తునే ఉన్నాం. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే నేచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం 'ద‌స‌రా' సినిమా బ‌డ్జెట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.

నాని క‌థానాయ‌కుడిగా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల 'ద‌స‌రా' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తెలంగాణ ద‌స‌రా పండుగ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తున్నార‌ను. ఇది పక్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్. తెలంగాణ గ‌ల్లీలో ద‌సరా హ‌డావుడి ఓ రేంజ్ లో ఊర మాస్ లెక్క‌. సినిమాలో అదే పాయిట్ ని హైలైట్ చేస్తున్నారు.

ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో నాని సైతం అదే విష‌యాన్ని రివీల్ చేసారు. ప‌క్కా నాటు సినిమా మా ద‌స‌రా అనే సారు. ఇలాంటి కంటెంట్ కి 60 కోట్లు వెచ్చిస్తున్నారు? అన్న టాక్ కొంద‌రిలో ఆదోళ‌న‌క‌నంగా మారింది. ఈ బ‌డ్జెట్ నిజ‌మైతే నాని మార్కెట్ ని మించి ఖ‌ర్చు చే స్తున్న‌ట్లు చెప్పాలి. అలాగే ఇలాంటి కంటెంట్ కి అంత బ‌డ్జెట్ కేటాయింపు క‌రెక్టేనా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌గా ఉత్ప‌న్న మ‌వుతుంది.

సింగ‌రేణి బ్యాక్ డ్రాప్ కోసం కొన్ని సెట్లు నిర్మిస్తున్నారు. వాటి కోసం ఏకంగా 10 కోట్లు వెచ్చిస్తున్నారుట‌. స‌న్నివేశాలు వాస్త‌వికంగా పండాలంటే సెట్లు త‌ప్ప‌ని స‌రి కావ‌డంతో అన్ని కోట్లు కేటాయించాల్సి వ‌స్తోందిట‌. ఆ సెట్లు 'రంగ స్థ‌లం' సినిమా సెట్ హైలైట్ అవుతున్న‌ట్లు గా ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతుంది. అయితే ఇక్క‌డే ఓవ‌ర్ ది బోర్డ్ బ‌డ్జెట్ అనే మాట వినిపిస్తుంది.

ఇప్ప‌టివ‌ర‌కూ నాని న‌టించిన ఏ సినిమాకి ఇంత బ‌డ్జెట్ ఖ‌ర్చు చేయ‌లేదు. గ‌తంలో నాని న‌టించిన 'ఈగ' సినిమాకి 40 కోట్లు ఖ‌ర్చు అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల‌ సూళ్ల‌ని సాధించింది. నాని ని 100 కోట్ల క్ల‌బ్ లో చేర్చిన తొలి చిత్రమిది. ఆ త‌ర్వాత కొన్నేళ్ల‌కి 'ఎంసీఏ' ఈగ స‌ర‌స‌న నిలిచింది. మిగ‌తా సినిమాలు నిర్మాణ ప‌రంగా నాని మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌టివ‌ర‌కూ వెచ్చించింది 40-50 కోట్ల మ‌ధ్య‌లోనే.

కానీ 'ద‌స‌రా' ఇప్పుడు ఆ బ‌డ్జెట్ ని బీట్ చేస్తుంది. 'ద‌స‌రా' ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ స్ర్కిప్ట్. ఇప్పుడ‌దే 60 కోట్ల బ‌డ్జెట్ ని కంగారు పెడుతుంది. ఆ కంగారు హుషారుగా మారాలంటే మాత్రం 'ద‌స‌రా' 150 కోట్లు దాటి వ‌సూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఇక్క‌డ గుర్తు చేయాల్సిన సంగ‌తి మ‌రొక‌టి ఉంది. సుకుమార్ శిష్యుల‌కు స‌క్సెస్ రేట్ బాగుంది.

బుచ్చిబాబు..ప‌ల్నాటి సూర్య ప్రతాప్ లాంటి వారు సుకుమార్ శిష్యులే. సుకుమార్ వ‌ద్ద శిష్య‌రికం చేసి బ‌య‌ట‌కొచ్చి సినిమాలు చేసి స‌క్సెస్ అయ్యారు. యువ మేక‌ర్ శ్రీకాంత్ కూడా అదే కోవ‌లో నిలుస్తాడ‌ని ధీమా వ్య‌క్తం అవుతోంది. ఆ నమ్మ‌కంతోనూ నిర్మాణ ప‌రంగా నిర్మాత‌లు వెనుక‌డుగు వేయ‌డం లేద‌ని తెలుస్తోంది.