Begin typing your search above and press return to search.

నాని దసరా హడావుడి అప్పుడే!

By:  Tupaki Desk   |   16 Jan 2023 8:30 AM GMT
నాని దసరా హడావుడి అప్పుడే!
X
నేచురల్ స్టార్ నాని చాలా గ్యాప్ తర్వాత దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో నాని దసరా మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సినిమాపై నాని చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. మొదటి సారి ఫుల్ మాస్ లుక్ లోకి ఈ సినిమా కోసం నాని మారిపోయాడు.ఇక నాని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఏకంగా 70 కోట్ల వరకు ఈ సినిమాపై నిర్మాత శ్రీనివాస్ చెరుకూరి పెట్టుబడి పెట్టారు. ఇక ఈ మూవీలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటించింది. సముద్రఖని, సాయి కుమార్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగ పరిచయం అవుతున్నాడు. కొత్త హీరో మీద నమ్మకంతో సరికొత్త కథాంశంతో నాని దసరా మూవీతో పెద్ద ప్రయోగమే చేస్తున్నాడని చెప్పాలి.

గత రెండేళ్ళ కాలంలో నాని నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. వాటిలో శ్యామ్ సింగరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మిగిలిన సినిమాలు అన్ని కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు నిర్మాతగా హిట్ ఫ్రాంచైజ్ ని నాని నిర్మిస్తున్నాడు. నిర్మాతగా గత ఏడాది హిట్ 2తో సూపర్ హిట్ కొట్టాడు. ఈ ఫ్రాంచైజ్ లో పార్ట్ 3లో తానే నటించబోతున్నట్లు నాని ఆ సినిమా ద్వారానే క్లారిటీ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే దసరా సినిమా మర్చి 30న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపొయింది. ఈ నేపధ్యంలో దసరా లుక్ నుంచి నాని కూడా బయటకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ పై నాని దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల ఆఖరు నుంచి ప్రమోషన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ ప్రమోషన్ లో నానితో పాటు కీర్తి సురేష్ కూడా భాగామవ్వబోతుందని తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.