Begin typing your search above and press return to search.
వామ్మో ఆ అరుపులేంది?.. తిట్లేంది నాని?
By: Tupaki Desk | 29 July 2018 4:33 AM GMTబిగ్ బాస్ 2లో చిత్ర.. విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారంలోని ఐదు రోజులు ఒక మాదిరి.. వారాంతంలో వచ్చే నాని వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తేలా చేస్తున్నాయి. ఆ మధ్యన బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ తీరుపై క్లాస్ పీకిన నాని.. మరోసారి బెత్తం పట్టుకున్న టీచర్ ను తలపించేలా క్లాస్ పీకాడు.
వారంలో జరిగిన అంశాల మీద రివ్యూ చేసే నాని తీరు సరిగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా.. ఇదంతా ఒక షో. అందులో ఉన్న వారేమీ చిన్నపిల్లలు కాదు.. అదే సమయంలో సామాన్యులు కూడా కాదు. ఒక చిన్న సమూహాన్ని ఒక ఇంట్లో ఉంచేసి.. బయట విషయాలతో వారికి సంబంధం లేకుండా చేసి.. వారు వంద రోజులు ఉండటం మామూలు విషయం కాదు. దీనికి సరిపోనట్లు బిగ్ బాస్ పెట్టే ఫిట్టింగులు ఉండనే ఉంటాయి.
ఇలాంటప్పుడు కోపతాపాలు.. అపార్థాలు.. ఆవేవకావేశాలు ఇలా చాలానే జరుగుతుంటాయి. ఒకవేళ.. హౌస్ మేట్స్ మధ్య చక్కటి వాతావరణం ఉంటే.. దాన్ని చెడగొట్టేలా బిగ్ బాస్ టాస్కులు ఇవ్వటం తెలిసిందే.
ఇలాంటప్పుడు సభ్యుల తీరును తప్పు పట్టి వారికి క్లాసులు పీకే నాని.. కొన్ని సందర్భాల్లో బిగ్ బాస్ ఇచ్చే తలతిక్క టాస్కుల మీద ఈ షోను చూసే వారు చావు తిట్లు తిట్టాల్సి వస్తే ఎవరిని తిట్టాలి?
ఈ వారంలో బాబు గోగినేని.. కౌశల్.. గీతామాధురిల మధ్య నడిచిన వాగ్వాదం ముచ్చట తెలిసిందే. గతంతో పోలిస్తే.. ఈ సారి మోతాదు మించినట్లుగా మారటమే కాదు.. చూస్తున్న వారికి సైతం ఏమిటిదంతా? మరీ... చిన్న పిల్లల మాదిరన్న మాట పలువురి నోట వినిపించింది.
సిల్లీ గొడవలకు చిరాకు పడుతున్న జనాలకు.. నాని క్లాసుల పరంపర మరింత మండేలా చేస్తోంది. వాతావరణం వేడెక్కి ఉన్న వేళలో.. సూచనల్ని చాలా సింఫుల్ గా చెబుతూ.. ఏదైనా తప్పులు చేస్తుంటే.. దానికి సంబంధించి సలహాలు ఇవ్వాలంటే సున్నితమైన మాటలతో చెప్పాల్సింది పోయి.. ముఖం గంటు పెట్టుకొని.. పై నుంచి కింద వరకూ క్లాస్ పీకటమే థ్యేయమన్న రీతిలో నాని వ్యవహరించిన వైనం సరిగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బిగ్ బాస్ సీజన్ వన్ తో పోలిస్తే.. సీజన్ టు భిన్నంగా సాగుతున్న వైనం తెలిసిందే. నాని వచ్చాడంటే.. రోటీన్ కు రిలీఫ్ అన్నట్లు ఉండాలే కానీ.. క్లాస్ పీకటానికి.. తిట్లు తిట్టటానికే వచ్చినట్లుగా ఉండకూడదు. ఆ విషయాన్ని నాని.. అతడ్ని నడిపించే బిగ్ బాస్ షో నిర్వాహకులు అర్థం చేసుకుంటే మంచిది. లేకుంటే.. నష్టం బిగ్ బాస్ కే!